CNG Cars: బెస్ట్ మైలేజీతో రూ. 10 లక్షలలోపు లభించే టాప్ 5 CNG కార్లు.. వివరాలు ఇవిగో!

ఒకవైపు మండుతున్న పెట్రోల్ ధరలు.. మరోవైపు మీ కారు అందిస్తోన్న తక్కువ మైలేజ్‌తో సతమతమవుతున్నారా.? అయితే టెన్షన్ పడకండి.. తక్కువ బడ్జెట్, బెస్ట్ మైలేజ్‌ను అందించే 5 చౌకైన CNG వాహనాలను మీ ముందుకు తీసుకొచ్చేశాం. మీరూ ఓ లుక్కేయండి..

Ravi Kiran

|

Updated on: Feb 13, 2023 | 4:35 PM

మారుతి ఆల్టో 800 CNG వేరియంట్ ధర రూ. 5.03 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతోంది. ఇది కెజి సిఎన్‌జిపై 31.59కిమీల వరకు మైలేజీని ఇస్తుంది.

1 / 5
టాటా టియాగో(బిఎస్ 6) సిఎన్‌జి వెర్షన్ ధర 6.43 - 8.04 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ కారు 26.49km/(CNG)kg మైలేజీ అందిస్తుంది. ఇందులో 7 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

2 / 5
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సిఎన్‌జి మాగ్నా, స్పోర్ట్జ్ మోడల్ అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు రూ. 7.56 లక్షల నుంచి రూ. 8.11 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ఉంది. ఈ కార్లు కిలో సిఎన్‌జికి 28కిమీల మైలేజీని అందిస్తాయి.

3 / 5
టాటా టిగోర్ CNG వేరియంట్‌ ఒక కిలో సిఎన్‌జికి 26.49కిమీ మైలేజీని అందిస్తుంది. ఈ కారు 4 వేరియంట్లలో అందుబాటులో ఉండగా.. ధర 7.59 లక్షల(ఎక్స్-షోరూమ్) నుంచి 8 లక్షల 89 వేల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

4 / 5
Maruti Eeco S CNG ధర 6.51 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభమవుతోంది. ఈ కారు 1 కేజీ సీఎన్‌జీకి 26.78కిమీల మైలేజీని అందిస్తుంది. అలాగే దీని సీటింగ్ సామర్ధ్యం కూడా పెద్దదిగా ఉంటుంది.

5 / 5
Follow us