Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: బాత్రూంలో వింత శబ్ధాలు.. టవల్‌ తీసి చూడగా ఒళ్లు జలధరించే సీన్‌.. వామ్మో..

చివరకు ఎక్కడా కనిపించకపోవడంతో.. టవల్‌ ను తీశానని.. అది బరువుగా ఉండటంతో అనుమానించానని తెలిపాడు. టవల్‌ను అకస్మాత్తుగా తీయడంతో

Viral: బాత్రూంలో వింత శబ్ధాలు.. టవల్‌ తీసి చూడగా ఒళ్లు జలధరించే సీన్‌.. వామ్మో..
Bathroom
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 12, 2023 | 1:01 PM

సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం.. వాటిని దగ్గరనుంచి చూస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విషపూరితమైన జంతువులకు దూరంగా ఉండేందుకు ఇష్టపడుతారు. అలాంటి భయంకరంమైన పాముల్లో కోబ్రా ఒకటి.. నాగుపాము కాటేస్తే నిమిషాల్లోనే చనిపోయే ప్రమాదం ఉంది. తాజాగా.. ఓ భయంకరమైన నాగుపామును బాత్రూంలోని టవల్‌ కింద గుర్తించినట్లు స్నేక్‌ క్యాచర్‌ పేర్కొన్నాడు. మీరు కూడా బాత్రూమ్ లో టవల్ ను ఉపయోగిస్తుంటే.. ఈ భయంకరమైన నిజం తెలిసి మీరు కూడా షాకవుతారు. ఈ షాకింగ్‌ ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. టవల్‌ కింద అత్యంత ఘోరమైన నాగుపామును కనుగొన్నట్లు దక్షిణాఫ్రికాలోని సైమన్ టౌన్‌కి చెందిన స్నేక్‌ క్యాచర్ స్టీవ్ మీఘన్ పేర్కొన్నాడు. డీప్ సౌత్ రెప్టైల్ లోని ఓ ఇంట్లో పామును చూసి.. తమకు సమాచారం ఇచ్చారని దానిని కొన్ని గంటల పాటు రెస్క్యూ చేసినట్లు వెల్లడించాడు.

ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే ఉంటారని.. ఈ సమయంలో ఓ నాగుపాము ఇంట్లోకి ప్రవేశించినట్లు స్నేక్‌ క్యాచర్‌ తెలిపాడు. పాము ఇంట్లోకి ప్రవేశించి చాలాకాలంగా అక్కడే తిష్టవేసినట్లు తెలిపాడు. అయితే, యజమాని చూసే సరికి నాగుపాము హాలులో ఉందని.. ఆ తర్వాత తప్పించుకోవడానికి పాము బాత్రూమ్ లోకి వెళ్లిందని తెలిపాడు.

ఇల్లు మొత్త వెతికినా పాము కనిపించలేదని.. చివరకు బాత్రూమ్‌లోకి వెళ్లి క్షణ్ణంగా పరిశీలించినట్లు తెలిపాడు. ఈ సమయంలో చేతులను తుడుచుకునేందుకు అక్కడున్న టవల్‌ వెనుకకు వెళ్లి దాక్కుందని స్నేక్‌ క్యాచర్‌ పేర్కొన్నాడు. చివరకు ఎక్కడా కనిపించకపోవడంతో.. టవల్‌ ను తీశానని.. అది బరువుగా ఉండటంతో అనుమానించానని తెలిపాడు. టవల్‌ను అకస్మాత్తుగా తీయడంతో ఆ టవల్‌ కింద పాము దాగిఉందని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

ఇంటి తలుపులు మూసివేడంతో పాము బాత్రూంలోకి వెళ్లి అక్కడున్న టవల్‌ వెనుక దాక్కుందని తెలిపాడు. సాధారణంగా పాములు భయంకరంగా కనిపిస్తాయని.. కానీ ఇది ప్రశాంతంగా కనిపించిందని.. మన స్పందనను బట్టి.. దాని స్పందన కూడా అలానే ఉంటుందని తెలిపాడు. చివరకు పామును రెస్క్యూచేసి దానిని అడవిలో వదిలిపెట్టానని పేర్కొన్నాడు.

Snake

Snake

దక్షిణాఫ్రికాలో అత్యంత ప్రాణాంతకమైన పాములు బ్లాక్ మాంబా, కోబ్రా లాంటివి ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి అత్యంత విషపూరితమైన పాములని.. కాటేసిన నిమిషాల్లోనే ప్రాణాలు పోతాయని పేర్కొంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..