AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పావురమా మజాకా..! ట్యూన్‌కు తగిన స్టెప్పులతో దుమ్మురేపే డ్యాన్స్‌.. వీడియో చూస్తే మీరూ చిందేస్తారు..

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా.. ఓ పావురానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: పావురమా మజాకా..! ట్యూన్‌కు తగిన స్టెప్పులతో దుమ్మురేపే డ్యాన్స్‌.. వీడియో చూస్తే మీరూ చిందేస్తారు..
Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Feb 12, 2023 | 12:15 PM

Share

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా.. ఓ పావురానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో, ఒక పావురం గిటార్ ట్యూన్‌లో హృదయాన్ని కదిలించేలా నృత్యం చేసింది. డ్యాన్స్ చేసిన ఈ పావురంపై సోషల్ మీడియాలో యూజర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ వ్యక్తి ఓ వీధిలో గిటార్ వాయిస్తూ ప్రజలను అలరిస్తున్నట్లు ఈ వీడియోలో చూడవచ్చు. అందుకు ప్రతిగా కొంత మంది ఆ వ్యక్తికి డబ్బులు కూడా ఇస్తున్నారు. ఈ తరహా ట్రెండ్ విదేశాల్లో ఉంది. మనదేశంలో కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఐరోపా దేశాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. వ్యక్తి వీధిలో నిలబడి ఉన్నాడు. అతని చేతిలో గిటార్ ఉంది. కాసేపు రిహార్సల్ చేశాక గిటార్ వాయించడం మొదలుపెట్టాడు. అటువైపు వస్తూ పోతున్నవారు గిటార్ ట్యూన్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది పర్సులోంచి డబ్బులు తీసి ఆ వ్యక్తికి ఇస్తున్నారు.

అక్కడ ఒక పావురం కూడా ఉంది. అతను గిటార్ వాయిస్తుండగా.. పావురం కూడా ట్యూన్ కి తగినట్లు డ్యాన్స్ వేయడం ప్రారంభించింది. గిటార్ ట్యూన్ వింటూ పావురం ఎలా నృత్యం చేస్తుందో ఈ వీడియోలో చూడవచ్చు. దానికి ఒక కాలు మాత్రమే ఉంది. అయినప్పటికీ.. జంప్ చేస్తూ పావురం అక్కడున్నవారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

పావురం స్ట్రీట్ డ్యాన్స్ చేయడం చూసి.. అందరూ షాకవుతున్నారు. పావురం ఇంత అందంగా నాట్యం చేయడం ఇదే మొదటిసారి చూస్తున్నామంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోను ఫన్ వైరల్ విడ్స్ అనే యూజర్ సోషల్ మీడియా ట్విట్టర్‌లో షేర్ చేయగా.. వేలాది మంది వీక్షించి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ వీడియో పాతదే అయినప్పటికీ.. మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?
హిల్ట్‌ పాలసీ చర్చ.. నేడు రసవత్తరంగా సాగనున్న తెలంగాణ అసెంబ్లీ!
హిల్ట్‌ పాలసీ చర్చ.. నేడు రసవత్తరంగా సాగనున్న తెలంగాణ అసెంబ్లీ!