Watch Video: తండ్రిని బతికించుకోవడానికి ఓ పసివాడి యాతన.. సర్కార్‌పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ తండ్రిని బతికించుకోవడానికి ఆరేళ్ల బాలుడి తపన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. మండే ఎండలో.. నడి రోడ్డుపై తన చిట్టి చేతులతో తండ్రిని తోపుడు బండిపై తోసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఆ పసి ప్రాణం..
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ తండ్రిని బతికించుకోవడానికి ఆరేళ్ల బాలుడి తపన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. మండే ఎండలో.. నడి రోడ్డుపై తన చిట్టి చేతులతో తండ్రిని తోపుడు బండిపై తోసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఆ పసి ప్రాణం పడుతున్న ఆవేదన చూపరుల గుండెలు తరుక్కుపోయేలా చేస్తోంది. మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకెళ్తే..
మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోలో ఆరేళ్ల పిల్లవాడు తన తండ్రిని తోపుడు బండిపై తోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లడం కనిపిస్తుంది. దాదాపు మూడు కిలోమీటర్లు నడిచాక బాలుడు కాళ్లూ, చేతులు నొప్పిపుట్టడంతో బండిని పట్టుకుని రోడ్డుపై కూర్చోవడం వీడియోలో కనిపిస్తుంది. బండికి ముందు వైపు తల్లి కూడా బండిని తోస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కనీసం అంబులెన్స్ సదుపాయం కూడా కల్పించలేని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా యంత్రాంగం విచారణ జరపాలని అధికారులు ఆదేశించింది.
शायद मध्य प्रदेश की एंबुलेंस गरीबों के लिए नहीं है, इसलिए मरीज़ को ठेले पर लिटाकर अस्पताल ले जाया जा रहा है!!
वीडियो मे मरीज़ की पत्नी और बेटे ठेले को धक्का लगाकर ले जा रहे है!#MadhyaPradesh #सिंगरौलीhttps://t.co/7uIlBCDFZq pic.twitter.com/VD6N5nSUow
— Sadaf Afreen صدف (@s_afreen7) February 11, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.