Telangana: కొత్తవారికి ఆసరా పెన్షన్లపై కీలక అప్‌డేట్‌.. అసెంబ్లీలో మంత్రి ఎర్రబెల్లి ఏమన్నారంటే..?

తెలంగాణ రాష్ట్రంలో అర్హత కలిగిన వారందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి శుక్రవారం (ఫిబ్రవరి 10) తెలిపారు..

Telangana: కొత్తవారికి ఆసరా పెన్షన్లపై కీలక అప్‌డేట్‌.. అసెంబ్లీలో మంత్రి ఎర్రబెల్లి ఏమన్నారంటే..?
Asara Pension
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 10, 2023 | 4:10 PM

తెలంగాణ రాష్ట్రంలో అర్హత కలిగిన వారందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి శుక్రవారం (ఫిబ్రవరి 10) తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆసరా పెన్షన్లపై అడిగిన ప్రశ్నకు మంత్రి ఎర్రబెల్లి సమాధానం ఇస్తూ.. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా.. 2014 నుంచి తెలంగాణ రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, హెచ్ఐవి వ్యాధి గ్రస్తులు, బీడి కార్మికులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా వ్యాధి గ్రస్తులకు సీఎం కేసీఆర్ పెన్షన్లు ఇస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 29 లక్షలు మందికి పెన్షన్లు ఇవ్వగా ఇప్పుడు 44 లక్షల 12 వేల 882 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అప్పుడు పెన్షన్ రూ.200 ఇప్పుడు రూ.2 వేలు ఇస్తున్నాం. అప్పట్లో ఏటా పెన్షన్ల కోసం 861 కోట్లు ఇవ్వగా…ఇప్పుడు 12 వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించాం. ఈ ఆర్ధిక సంవత్సరంలో 9,08,498 మందికి కొత్తగా పెన్షన్లు ఇస్తున్నామన్నారు.

ఇంకా మంత్రి ఈ విధంగా మాట్లాడారు.. ‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వెయ్యి మంది ఉన్న గ్రామంలో 60,70 మందికి పెన్షన్లు ఇస్తుంటే తెలంగాణలో మాత్రం 600,700 మందికి ఇస్తున్నాం. తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.3,000 పెన్షన్‌ ఇస్తాం అంటారు..వాళ్లు పాలించే రాష్ట్రాల్లో మాత్రం రూ. మూడు వేలు కూడా ఇవ్వడం లేదు. బీజేపీ పాలించే యూపీలో వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. మణిపూర్ రాష్ట్రంలో కేవలం రూ.200 నుంచి రూ.500, అస్సాంలో రూ.250 నుంచి రూ.550, నాగాలాండ్‌లో రూ.200, మిజోరాంలో రూ.300 మాత్రమే ఇస్తున్నారు.ఉత్తర ప్రదేశ్‌లో పెన్షన్ వెయ్యి రూపాయలు మాత్రమే. మోడీ, అమిత్ షా సొంత రాష్ట్రాలైన గుజరాత్‌లో కూడా వెయ్యి నుంచి రూ.1250 వరకు మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు. సాంకేతిక సమస్యల వల్ల పెన్షన్లకు ఇబ్బంది వస్తున్న చోట ఆ సమస్యను పరిష్కారిస్తామన్నారు. ఆర్థిక పరిస్థితిని బట్టే పెన్షన్లు ఇస్తున్నామని, పెన్షన్ పొందే భార్యాభర్తలలో ఎవరైనా ఒకరు చనిపోతే మిగిలిన వారికి పెన్షన్ ఇవ్వాలనే నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి పలువురు హర్షం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.