Bandi Sanjay: మేం అధికారంలోకి రాగానే సచివాలయం డోమ్‌లు కూల్చేస్తాం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సచివాలయం డోమ్‌లు కూల్చేస్తామంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన కామెంట్లు చేశారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కళ్లలో ఆనందం కోసమే సెక్రటేరియట్‌ను తాజ్ మహల్ నమూనాలో కట్టారని విమర్శించారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో భాగంగా బోయిన్‌పల్లిలో మాట్లాడారు బండి సంజయ్

తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సచివాలయం డోమ్‌లు కూల్చేస్తామంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన కామెంట్లు చేశారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కళ్లలో ఆనందం కోసమే సెక్రటేరియట్‌ను తాజ్ మహల్ నమూనాలో కట్టారని విమర్శించారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో భాగంగా బోయిన్‌పల్లిలో మాట్లాడారు బండి సంజయ్. ‘ ప్రస్తుత సచివాలయం భారతీయ సంస్కృతికి అనుగుణంగా లేదు. మేం అధికారంలోకి వచ్చాక భారతీయ సంస్కృతికి అనుగుణంగా సెక్రటేరియట్‌ను మార్పులు చేస్తాం. కేటీఆర్ రోడ్డుపక్కన ఉన్న గుడులు, మసీదులు కూల్చుతామంటున్నారు. ఆయనకు దమ్ముంటే.. ఓల్డ్ సిటీ నుంచే కూల్చుడు మొదలు పెట్టాలి. ఎంఐఎం, బీఆర్ఎస్ రెండూ ఒకటే. అందుకే తాజ్ మహల్ కన్నా అద్భుతంగా కొత్త సచివాలయం కట్టారని అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ ను ప్రశంసిస్తున్నారు. అసద్ కళ్లలో ఆనందం చూడ్డానికే కేసీఆర్ తాజ్ మహల్ నమూనాలో సచివాలయన్ని కట్టారు. 11 వేల కార్నర్ మీటింగ్స్ ను తెలంగాణ వ్యాప్తంగా 15 రోజుల్లో చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి,కుటుంబ పాలనపై ప్రజలోకి కార్నర్ మీటింగ్ ల ద్వారా తీసుకెళ్తాం. ప్రస్తుతం ప్రజలను పట్టించుకునే పరిస్థితిలో కేసీఆర్ లేరు. ప్రశ్నిస్తే జైల్లో పెడతామని హెచ్చరిస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు బండి సంజయ్.
నూతన సెక్రటేరియట్‌పై బండి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య పొలిటికల్ హీట్‌కు దారి తీసేలా ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర కొత్త సచివాలయం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అనుకున్న సమయానికే నూతన రాష్ట్రానికి చారిత్రాత్మక హంగులతో హుస్సేన్ సాగర్ తీరాన కొత్త సచివాలయంలోకి అడుపెట్టనుంది తెలంగాణా ప్రభుత్వం. సీఎం కేసిఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17న ఈ సచివాలయాన్ని ప్రారంభించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




