Vivekananda Case: హైదరాబాద్ సీబీఐ కోర్టులో వివేకానంద హత్య నిందితులు.. నేడు విచారణ

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వివేక కేసు విచారణ కడప నుంచి హైదరాబాద్ సిబిఐ కోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో తొలిసారిగా వివేక హత్య కేసులోని ఐదుగురు నిందితులు ఇవాళ సిబిఐ కోర్టు ముందు హాజరు కానున్నారు.

Vivekananda Case: హైదరాబాద్ సీబీఐ కోర్టులో వివేకానంద హత్య నిందితులు.. నేడు విచారణ
Ys Viveka Murder Case
Follow us

|

Updated on: Feb 10, 2023 | 7:15 AM

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులను ఇవాళ ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ సీబీఐ కోర్టులో హాజరు పరచనున్నారు. కడప జైల్లో ఉన్న నిందితులు సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి లను ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య తెల్లవారుజామున నాలుగు గంటలకు కడప జైలు నుంచి పోలీసులు తరలించారు. నాలుగు వాహనాల్లో ముగ్గురు నిందితులను హైదరాబాదుకు తీసుకెళ్లారు. ఉదయం 10:30 గంటలకు ఈ ముగ్గురు నిందితులు తోపాటు బెయిల్ పై ఉన్న ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి కూడా హైదరాబాద్ సిబిఐ కోర్టులో హాజరుకానున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వివేక కేసు విచారణ కడప నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో తొలిసారిగా వివేక హత్య కేసులోని ఐదుగురు నిందితులు ఇవాళ సీబీఐ కోర్టు ముందు హాజరు కానున్నారు. సీబీఐ కోర్టు విచారణ ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో ఐదుగురు నిందితులను న్యాయమూర్తి ప్రత్యక్షంగా వారిని కోర్టులో భౌతికంగా చూడన్నారు.

తరువాత న్యాయమూర్తి ఉత్తర్వుల మేరకు ముగ్గురు నిందితులైన సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి లను తిరిగి కడప జైలుకు తీసుకొస్తారా లేక హైదరాబాదు చంచలగూడ తరలిస్తారనేది న్యాయమూర్తి నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. నిందితులను హైదరాబాదుకు తీసుకెళుతున్న క్రమంలో గురువారం సాయంత్రమే దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆయన భార్య తులసమ్మ, కుమారుడు చైతన్య రెడ్డి జైలుకెళ్లి శివశంకర్ రెడ్డిని కలిసారు

Reporter: Sudheer

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు