Minister Roja: సూర్యలంక బీచ్‌లో మంత్రి రోజా సందడి.. త్వరలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తామని హామీ
బాపట్ల సూర్యలంక బీచ్‌లో సందడి చేశారు మంత్రి రోజా. బీచ్ అభివృద్ధికి త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. . వీకెండ్స్ లో సూర్యలంక బీచ్ కు పర్యటకుల తాకిడి పెరిగిందన్నారు.
బాపట్ల, సూర్యలంక బీచ్ ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్‌కె రోజా. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో పర్యటించి పర్యాటకశాఖ ఆధీనంలో నడుస్తున్న రిసార్టులోని అతిధి గృహాలు, సమావేశ మందిరం, అందుబాటులో ఉన్న వనరులను పరిశీలించారు. హరిత బీచ్ రిసార్ట్ లో కొంతసేపు గడిపారు. బీచ్ లో కొంతసేపు అలలను ఎంజాయ్ చేశారు. పర్యాటకులకు ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సూర్యలంక బీచ్ ని సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పర్యాటకులను ఆకర్షించడానికి అహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో విశాఖ ఆర్‌కే బీచ్ తర్వాత సెకండ్ ప్లేస్ లో సూర్యలంక బీచ్ ఎంతో ప్రాచూర్యం పొందిందని గుర్తు చేశారు.
సూర్యలంక బీచ్‌లో పర్యాటకులు ధైర్యంగా స్నానాలు ఆచరించడానికి సురక్షిత ప్రాంతమని తెలిపారు. వీకెండ్స్ లో సూర్యలంక బీచ్ కు పర్యటకుల తాకిడి పెరిగిందన్నారు. కార్తీకమాసం పండుగ సమయాల్లో 1.5 లక్షలమంది ప్రజలు ఈ తీరంలో పూజలు చేసి సముద్ర స్నానాలు ఆచరించడం ఇక్కడ ప్రత్యేకతని చెప్పారు మంత్రి రోజా. దీంతో సూర్యలంకను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలు తీసుకుంటామని.. త్వరలోనే పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తామన్నారు. పర్యాటక ప్రాంతాలను ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామని మంత్రి రోజా తెలిపారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్రస్థాయిలో సమీక్ష జరిగిందన్నారు. అందులో భాగంగానే పర్యాటక ప్రాంతాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు మంత్రి రోజా.
మరిన్ని ఆంద్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..