Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nijam With Smita: హీరో అవుదామని వస్తే.. అతడి కంటే అందగాడివా? అంటూ హేళన చేశారు: చిరంజీవి

సినీరంగం ఓ రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలో రాణించాలంటే పలుకుబడి తప్పనిసరి.. ఐతే ఎటువంటి సపోర్ట్‌లేకుండా కేవలం స్వయం కృషితోనే మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ స్థాయికి..

Nijam With Smita: హీరో అవుదామని వస్తే.. అతడి కంటే అందగాడివా? అంటూ హేళన చేశారు: చిరంజీవి
Smita Nijam First Episode
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 10, 2023 | 2:42 PM

సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే పలుకుబడి తప్పనిసరి అనుకునే రోజుల్లో.. ఎటువంటి సపోర్ట్‌లేకుండా కేవలం స్వయం కృషితోనే మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనీలివ్‌ వేదికగా గాయని స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘నిజం విత్ స్మిత’ ప్రోగ్రాంలో పాల్గొన్న చిరంజీవి పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో చిరు తన సినీ, వ్యక్తిగత విషయాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘నటుడిగా ఈ స్థాయికి చేరుకునే క్రమంలో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నాను. కొన్ని సందర్భాల్లో మానసిక క్షోభకు గురయ్యాను. నా బాధను ఎవరితోనూ పంచుకోలేదు. ఇండస్ట్రీలోకి రావాలనే ఆశతో మద్రాస్‌కు వచ్చిన కొత్తలో ఓసారి పాండిబజార్‌కు వెళ్లాను. అక్కడ ఓ వ్యక్తి నన్ను చూసి, ఏంటీ.. ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లోకి వచ్చావా? సినిమాల్లోకి ప్రయత్నిద్దామనే.. అతన్ని చూడు ఎంత అందంగా ఉన్నాడో.. అతడి కంటే నువ్వు అందగాడివా? తెలిసినవాళ్లు లేకపోతే ఇక్కడ అవకాశాలు రావడం కష్టం.. ఇంతటితో నీ కలను మర్చిపో’ అని నన్ను హేళనగా మాట్లాడాడు. ఆ మాటలు నన్ను ఎంతో బాధ పెట్టాయి. ఇంటికి వెళ్లి దేవుడి ముందు కూర్చొని, ఇలాంటి వాటికి బెదరకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత ఏడాదిపాటు ఆ పాండిబజార్‌ వైపు అస్సలు వెళ్లలేదు. ఇప్పుడెవరైనా నన్ను విమర్శిస్తే వాటిని పట్టించుకోను.. నవ్వుకుంటాను. కెరీర్‌ ప్రారంభంలో నా మెడలో మా నాన్న వేసిన హనుమంతుడి లాకెట్‌ ఉండేది. అది నన్ను కాపాడుతుందని గట్టిగా నమ్మేవాడిని. ఐతే ఓ సినిమా షూటింగ్‌లో అదెక్కడో పడిపోయింది. ఆరోజంతా భయాందోళనకు గురయ్యాను. తర్వాత దొరికింది గానీ అన్నయ్య సినిమా షూటింగ్‌లో ఎవరో ఎత్తుకెళ్లారని చెప్పుకొచ్చారు.

తాజాగా విడుదలైన ఈ షో ప్రోమోలో మెగాస్టార్‌ చిరంజీవి, హీరోయిన్‌ సాయి పల్లవి, దగ్గుబాటి రానా, నారా చంద్రబాబు నాయుడుతో పాటు తదితరులు పాల్గొన్నట్లు చూపించారు.  శుక్రవారం (ఫిబ్రవరి 10) ఈ షో ప్రారంభం అయ్యింది. ఫస్ట్ ఎపిసోడ్‌లో మెగాస్టార్‌ చిరంజీవి ఇంటర్య్వూను ప్రసారం చేశారు. ఈ ప్రోగ్రాంలో చిరు తన సినీ అనుభవాలను పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.