AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: టీచర్ల బదిలీలపై హైకోర్టు కీలక నిర్ణయం.. అప్పటివరకు ఆపాల్సిందేనంటూ ఉత్తర్వులు

తెలంగాణలోని ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 14 వరకు టీచర్ల బదిలీలపై స్టే విధిస్తూ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

Telangana: టీచర్ల బదిలీలపై హైకోర్టు కీలక నిర్ణయం.. అప్పటివరకు ఆపాల్సిందేనంటూ ఉత్తర్వులు
Telangana High CourtImage Credit source: TV9 Telugu
Basha Shek
|

Updated on: Feb 14, 2023 | 7:57 PM

Share

తెలంగాణలోని ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 14 వరకు టీచర్ల బదిలీలపై స్టే విధిస్తూ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఉపాధ్యాయుల బదిలీలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంటూ నాన్‌ స్పౌజ్‌ టీచర్ల అసోసియేషన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగ దంపతులు, యూనియన్‌ నేతలకు ఆదనపు పాయింట్లపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవివాదంపై విచారించిన హైకోర్టు మార్చి 14 వరకు టీచర్ల బదిలీల ప్రక్రియపై స్టే విధించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది.