TS Police Jobs: తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు మరో 52 వేల మంది అర్హత..8 మార్కులు అదనంగా కలిపిన బోర్డు

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. మొత్తం 16,969 కానిస్టేబుల్‌ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన దాదాపు 2.07 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా పలు కేంద్రాల్లో..

TS Police Jobs: తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు మరో 52 వేల మంది అర్హత..8 మార్కులు అదనంగా కలిపిన బోర్డు
TSLPRB
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 14, 2023 | 8:55 PM

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. మొత్తం 16,969 కానిస్టేబుల్‌ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన దాదాపు 2.07 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా పలు కేంద్రాల్లో డిసెంబరు 8 నుంచి 31 వరకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. వీరిలో 1,75,657 మంది అర్హత ప్రస్తుతం మెయిన్స్‌ రాతపరీక్షకు సాధించారు. ఈక్రమంలో ఒక్కో పోస్టుకు 11 మంది మాత్రమే పోటీ పడనున్నారు. అటు సివిల్‌ విభాగంలోనైతే 15,644 పోస్టులులకు కేవలం 90,488 మంది మాత్రమే పోటీలో ఉన్నారు. ఈలెక్కన ప్రతీ ఆరుగురిలో ఒకరికి కొలువు దక్కే అవకాశం ఉందని ఇప్పటి వరకూ అందరూ అనుకుంటున్నారు.

తాజాగా ప్రాథమిక రాత పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణులు కాలేకపోయినా పలువురు ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి అభ్యర్థులకు న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు మళ్లీ కొలువు దక్కించుకునే అవకాశం చిక్కింది. ఇలా దాదాపు 52 వేల మందికి పైగా అభ్యర్థులు మళ్లీ పోటీలో నిలిచారు. వీరికి ఫిబ్రవరి 15 నుంచి శారీరక సామర్థ్య పరీక్షలు జరగబోతున్నాయి. రాచకొండ, ఖమ్మం, సంగారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట మినహా మిగిలిన 7 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్ష కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఏర్పాట్లు పూర్తి చేసింది.

టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ గతేడాది ఆగస్టులో నిర్వహించిన ప్రాథమిక రాతపరీక్షకు సుమారు 8.5 లక్షల మంది హాజరయ్యారు. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే 60 మార్కులు రావాలని నిర్ణయించారు. పరీక్షలో తప్పులు దొర్లాయని 8 మార్కులు తొలగించి టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఫలితాల్ని విడుదల చేసింది. అయితే ప్రిలిమ్స్‌లో తొలగించిన ప్రశ్నలకు మార్కుల్ని కలపాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ 8 మార్కులు కలపాలని కోర్టు ఆదేశించడంతో దాదాపు 52 వేల మంది అదనంగా అర్హత సాధించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.