CTET Answer Key: సీటెట్ అభ్యర్థులకు అలెర్ట్.. ఆన్సర్ కీని విడుదల చేసిన సీబీఎస్‌ఈ.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆన్సర్ కీ విడుదలైంది. గతేడాది డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 7 వరకు నిర్వహించిన CBSE CTET పరీక్షల ఆన్సర్ కీని సీబీఎస్ఈ..

CTET Answer Key: సీటెట్ అభ్యర్థులకు అలెర్ట్.. ఆన్సర్ కీని విడుదల చేసిన సీబీఎస్‌ఈ.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..
Cbse Ctet Answer Key 2022
Follow us

|

Updated on: Feb 14, 2023 | 4:59 PM

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్ 2022) ఆన్సర్ కీ విడుదలైంది. గతేడాది డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 7 వరకు నిర్వహించిన CBSE CTET పరీక్షల ఆన్సర్ కీని సీబీఎస్ఈ ఈ రోజు(ఫిబ్రవరి 14 మంగళవారం) తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఆ మేరకు సీటెట్ 2022 రాసిన అభ్యర్థులు ఆన్సర్ కీని సీబీఎస్ఈ సీటెట్ అధికారిక వెబ్ సైట్ అయిన ctet.nic.in లో చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ కీపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నవారికి నేటి నుంచి ఫిబ్రవరి 17 వరకు అవకాశం ఉంటుంది. అభ్యంతరం ఉన్న అభ్యర్థులు  CBSE CTET అధికారిక సైట్ ద్వారానే ఆన్సర్ కీపై అభ్యంతరాలను లేవనెత్తవచ్చు. ఏదైనా ఇతర మోడ్ ద్వారా అంటే.. ఇమెయిల్/పోస్ట్ లేదా వ్యక్తిగతంగా సమర్పించిన అభ్యంతరాలు అంగీకరించబడవు. ఆన్సర్ కీ లోని ప్రశ్నలు, జవాబులపై అభ్యంతరం వ్యక్తం చేయాలనుకునే అభ్యర్థులు ఒక్కో అభ్యంతరానికి రూ. 1000 ని ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును ఆన్ లైన్ లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన అభ్యంతరాలను మాత్రమే సంబంధిత సబ్జెక్టు నిపుణులు పరిశీలిస్తారు.

ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?

సీబీఎస్ఈ సీటెట్ ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకుందుకు ముందుగా..

  • CBSE CTET అధికారిక సైట్‌ ctet.nic.inని సందర్శించండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న CTET ఆన్సర్ కీ 2022 లింక్‌పై క్లిక్ చేయండి.
  • లాగిన్ వివరాలను నమోదు చేసి, సబ్మిట్‌పై క్లిక్ చేయండి.
  • మీ ఆన్సర్ కీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • ఆన్సర్ కీని చెక్ చేసి తదుపరి అవసరం కోసం డౌన్‌లోడ్ చేసుకోండి.

అభ్యంతరాలు తెలియజేయడం ఎలా..?

సీబీఎస్ఈ సీటెట్ ఆన్సర్ కీ 2022(CBSE CTET )పై అభ్యంతరం వ్యకం చేయాలనుకునే అభ్యర్థులు ముందుగా..

ఇవి కూడా చదవండి
  • సీబీఎస్ఈ సీటెట్ (CBSE CTET ) అధికారిక వెబ్ సైట్ ctet.nic.in ఓపెన్ చేయాలి.
  • హోం పేజ్‌పై కనిపిస్తున్న చాలెంజ్ సబ్మిషన్ (challenge submission) లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అభ్యంతరం (objection) వ్యక్తం చేయాలనుకున్న ప్రశ్నను సెలెక్ట్ చేసుకుని, సెలెక్ట్ ఫర్ చాలెంజ్ (select for challenge)ను క్లిక్ చేయాలి.
  • ఆ తరువాత ఆన్సర్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసి సబ్మిట్ (submit) బటన్‌పై క్లిక్ చేయాలి.
  • ఆన్ లైన్‌లో రూ. 1000 ఫీజు చెల్లించి సబ్మిట్ (submit) బటన్‌పై క్లిక్ చేయాలి.
  • Direct link to raise objections against CBSE CTET Answer Key 2022

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి..