Exam Preparation Tips: ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ఒత్తిడి లోనవ్వకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!!
Education News: బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గరపడ్డాయి. ఈ సమయంలో విద్యార్థులు ఒత్తిడిని ఎదుర్కొంటారు. సమయం తక్కువగా ఉంటే ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది.
బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గరపడ్డాయి. ఈ సమయంలో విద్యార్థులు ఒత్తిడిని ఎదుర్కొంటారు. సమయం తక్కువగా ఉంటే ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది. కొంతమంది విద్యార్థులు పరీక్ష సమయం దగ్గరపడే వరకు చదవడం ప్రారంభించరు. ఆలస్యం చేయడం, చదవడం వాయిదా వేయడం వల్ల మరింత ఒత్తిడికి లోనవుతారు. ఫలితంగా పరీక్షలు ఉత్తమ ఫలితాలు పొందలేకపోతారు. అయితే పరీక్షలకు ముందు ఒత్తిడికి గురికాకుండా చురుగ్గా చదువుకోవడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. మీరు ఉత్తమ ఫలితాలను పొందగలిగేలా అధ్యయన ప్రణాళికను ఎలా రూపొందించుకోవాలని తెలుసుకుందాం.
- 30నిమిషాలు చదవాలి: కొంతమంది విద్యార్థులు పరీక్షల సమయం దగ్గరపడ్డాక గబగబ చదువుతుంటారు. ఇలా చదవడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. సిలబస్ మొత్తాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకోవాలి. ఉదాహారణకు పరీక్షకు ఒక రోజూ ముందు ఒక గంట చదువుకోవడానికి ప్రయత్నించే బదులుగా…ఒక వారంపాటు ప్రతిరోజూ 30నిమిషాలు, మరుసటి రోజు మరో 30 నిమిషాలు చదవడానికి ప్రయత్నించండి.
- షెడ్యూల్ పెట్టుకోవాలి: టైం మేనేజ్మెంట్ సరిగ్గా ఉండాలి. విద్యార్థులు తమ షెడ్యూల్ కు కట్టుబడి ఉండాలి. లక్ష్యాలను పెట్టుకోవాలి. వాయిదా వేయకుండా ఉండాలి. ప్రతి సబ్జెక్టుకు సమానమైన ప్రిపరేషన్ సమయం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఫ్లాష్ కార్డులను ఉపయోగించాలి: మీరు ఏదైనా గుర్తుంచుకోవాలనుకున్నప్పుడు ఫ్లాష్ కార్డులు అద్భుతంగా పనిచేస్తాయి. ఉదాహరణకు మీరు మానవ శరీరంలోని అన్ని అవయవాల పేర్లను గుర్తుంచుకోవాలనుకుంటే..వాటిని కాగితంపై రాసి…ప్రతి అవయవం ఎక్కడ ఉంటుందో గుర్తుపెట్టుకోవాలి.
- నోట్స్ తయారు చేసుకోవడం: మీరు క్లాస్ రూంకి వెళ్లేప్పుడు మీ చేతి తప్పకుండా నోట్ బుక్ ఉండాలి. ఎందుకంటే టీచర్స్ చెప్పే విషయాలను ట్రాక్ చేయవచ్చు. ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పరీక్షల సమయంలో చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే పుస్తకంలోని ప్రతి పేజీ చదవడం కంటే ఈ ముఖ్యమైన విషయాలను చదివితే సరిపోతుంది.
- విభిన్నంగా అధ్యయనం చేయాలి: చదవడానికి ఏదైతే అనువుగా ఉంటుందో అదే మార్గాన్ని ఎంచుకోవాలి. మీరు చదువుతున్నప్పుడు మీకు ఇది ఇంపార్టెంట్ అని అనుకున్న పాయింట్స్ నోట్స్ రాసుకోవాలి. మ్యాథ్స్ అయితే సూత్రాలు గుర్తుంచుకోవాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటివి ఫార్మూలాలు గుర్తుంచుకోవాలి. లాజిక్ తో గుర్తుపెట్టుకుంటే మీకు పరీక్షల్లో ఇబ్బంది ఉండదు.
- విరామం తీసుకోవాలి: గంటల తరబడి కూర్చుని చదవకూడదు. అలా చదివితే అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ప్రతి గంటకు విరామం తీసుకుంటూ చదువుకుంటే మరింత దృష్టి పెట్టేలా చేస్తోంది. పరీక్షకు రెండు రోజుల ముందు అతిగా చదవకుండా ముఖ్యమైన విషయాలను మాత్రమే చదువుకోవాలి.
- కీలకమైన సబ్జెక్టులకు అధిక ప్రాధాన్యత: విద్యార్థులు పరీక్షల్లో రాణించాలంటే కీలకమైన సబ్జెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. కష్టంగా ఉండే సబ్జెక్టులకు ఎక్కువగా సమయం..సులభమైన సబ్జెక్టులకు తక్కువ సమయం కేటాయించాలి. ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే వాటన్నింటిని ముందుగానే క్లియర్ చేసుకోవాలి.
ఇవి కూడా చదవండి
మరిన్ని కెరీర్ వార్తలు చదవండి..