AP POLYCET Exam: విద్యార్థులకు అలర్ట్.. పాలిసెట్ డేట్ ఫిక్స్.. త్వరలోనే పూర్తి షెడ్యూల్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష పాలిసెట్‌ను మే నెల 10న నిర్వహించనున్నారు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. ఉదయం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష పాలిసెట్‌ను మే నెల 10న నిర్వహించనున్నారు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష ఉంటుంది. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100 రిజిస్ట్రేషన్, ప్రవేశ పరీక్ష ఫీజుగా నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.50లక్షల మంది పాలిసెట్‌కు హాజరవుతారని సాంకేతిక విద్యాశాఖ అంచనా వేస్తోంది. 54 పాలిటెక్నిక్ కేంద్రాల్లో 10వేల మంది పరీక్ష రాయనున్నారు. అప్లికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాల షెడ్యూల్‌ను తర్వలో విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
తెలంగాణలో వచ్చే విద్యాసంవత్సరానికి టీఎస్ పాలిసెట్ ప్రవేశ పరీక్ష మే 17న నిర్వహించనున్నట్టు సాంకేతిక విద్యామండలి ప్రకటించింది. ఇప్పటికే దరఖాస్తులు ప్రారంభమయ్యాయని, ఏప్రిల్ 24 వరకు www.polycet.sbtet.telangana.gov.in వెబ్‌సెట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష నిర్వహించిన 10 రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం