Infosys: విశాఖ ఐటీ సెక్టార్‌లో సందడి.. మరో రెండు నెలల్లో ఇన్ఫోసిస్ ఆఫీస్ ఓపెన్.. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలవారికే ప్రాధాన్యత..

విశాఖ ఐటీ ఎంప్లాయిస్‌కి శుభవార్త. ఆఫీస్ తెరిచిన ఇన్ఫోసిస్. లోకల్ ప్రొఫెషనల్స్‌కి మంచి ఛాన్స్. ఇకపై సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కి మరిన్ని అవకాశాలొస్తాయా? విశాఖలో ఐటీ పరంగా జరుగుతోన్న అభివృద్ధి ఎలాంటిది?

Infosys: విశాఖ ఐటీ సెక్టార్‌లో సందడి.. మరో రెండు నెలల్లో ఇన్ఫోసిస్ ఆఫీస్ ఓపెన్.. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలవారికే ప్రాధాన్యత..
It Minister Gudivada Amarnath On Infosys
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 15, 2023 | 7:53 AM

పోర్ట్ సిటీలో ఇన్ఫోసిస్.. ఆఫీస్ ఓపెనింగ్.. తో ఒక్క సారిగా ఐటీ ఎంప్లాయిస్ లో జోష్ మొదలైంది.. మరో రెండు నెలల్లో విశాఖ పట్టణంలో ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు. ఇన్ఫోసిస్ వెయ్యిమంది ఉద్యోగుల సామర్థ్యంతో కార్యాలయాన్ని ప్రారంభించనుందని తెలిపారు. ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్లో అత్యధికులు ఆంధ్రప్రదేశ్ వాసులుగా గుర్తించారన్నారు. దేశంలోని ప్రతి వందమంది ఐటీ ఉద్యోగుల్లో 15 మంది తెలుగువారు ఉన్నారని. వీరిలో ఐదుగురు తెలంగాణ, పది మంది ఆంధ్రప్రదేశ్ వాసులున్నారని తెలిపారు. ఇప్పటికే పారివ్రామికంగా ప్రగతి సాధిస్తున్న విశాఖపట్టణం ఐటీలోనూ అగ్రగామి కానుందన్నారు. గడిచిన మూడున్నరేళ్లలో రాష్ట్రం రూ. 1.9 లక్షల కోట్లు విలువైన పెట్టుబడులకు అనుమతి మంజూరు చేసిందని చెప్పారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యశాఖ డైరెక్టర్ సృజన గుమ్మళ్ల, ఏపీ అర్థిక అభివృద్ధి మండలి సీఈఓ ఎల్.శ్రీధర్ రెడ్డి తదితురులు పాల్గొన్నారు.

ఇక, ఇప్పటికే ఇండోర్, నాగ్ పూర్ లో చిన్న కేంద్రాలుండగా.. తాజాగా వైజాగ్ సహా టైర్ టూ నగరాల్లో తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది ఇన్ఫోసిస్ హెచ్చార్ డిపార్ట్ మెంట్.. విశాఖ ఇన్ఫోసిస్ ఆఫీసు.. కేవలం శాటిలైట్ సెంటర్‌గా మాత్రమే కాకుండా.. కనీసం 650 సీట్ల సామర్ధ్యంతో మొదలు కానున్నట్టు చెబుతున్నారు అధికారులు. మే 31నుంచి విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించినున్నట్టు ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఋషికొండ సిగ్నటివ్ టవర్స్ లో కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన జారీ చేసింది. సరైన కార్యాలయం దొరకక ఆలస్యం అయినట్టు వివరణ ఇచ్చింది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు నుంచి ఉన్న ఇన్ఫోసిస్ ఉద్యోగులకు వైజాగ్ క్యాంపస్‌లో ప్రాధాన్యత ఇచ్చినట్లు ఇన్ఫోసిస్ తెలిపింది.

వచ్చే త్రైమాసికం చివరి నాటికి విశాఖతో పాటు మరో మూడు కొత్త ప్రాంతాల్లో తమ ఆఫీసులు తెరవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే మహతీ ఐటీ పార్కులో స్థలం తీసుకుంది. విశాఖలో కనీసం 10 లక్షల చదరపు అడుగుల ప్లగ్ అండ్ ప్లే స్పేస్ అందుబాటులో ఉంది. దీంతో ఐటీ సంస్థలు నగరానికి భారీగా వచ్చే అవకాశముందని భావించారు. కానీ గత కొన్నేళ్లుగా.. ఎలాంటి ఐటీ రంగ అభివృద్ధి చూడలేదు. ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ సంస్థలు.. ఇలా వైజాగ్ ను వెతుక్కుంటూ రావడం ఒక శుభపరిణామంగా భావిస్తున్నారు. ఇన్ఫోసిస్ తో పాటు మరిన్ని సంస్థలు కూడా క్యూ కట్టే పరిస్థితి ఉందంటున్నారు. దీంతో విశాఖ లో ఉంటోన్న ఐటీ ప్రొఫెషనల్స్ కి ఇదో.. గుడ్ న్యూస్ గా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం