Andhra Pradesh: కల్లు చెట్టు వివాదం.. అబ్బాయిను చంపేందుకు బాబాయ్ కుట్ర.. మరొకరు మృతి..
కల్లు చెట్టు విషయంలో ఏర్పడిన వివాదంతో తన రక్త సంబంధాన్ని కూడా పక్కకు పెట్టి.. సొంత అన్న కొడుకు ప్రాణాలు తీయడానికి బాబాయ్ పన్నిన కుట్ర వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన అల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక బంధాలే అన్నాడు కార్ల్ మార్క్స్.. దానిని నిజం చేస్తూ బతికేస్తున్నారు నేటి జనం. డబ్బులు, చిన్న చిన్న విషయాల్లో గొడవలు కూడా బంధాన్ని రక్త సంబంధాన్ని లెక్క చేయకుండా ప్రాణాలు తీసే వరకూ వెళ్తోంది. తాజాగా కల్లు చెట్టు విషయంలో ఏర్పడిన వివాదంతో తన రక్త సంబంధాన్ని కూడా పక్కకు పెట్టి.. సొంత అన్న కొడుకు ప్రాణాలు తీయడానికి బాబాయ్ పన్నిన కుట్ర వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన అల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
అల్లూరి జిల్లా జీకే వీధి మండలం ఆకులూరులో కల్తీకల్లు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకరి ప్రాణాలు బలిగొని.. మరి కొంతమందిని ఆసుపత్రి పాలు చేసిన కల్లులో బుగ్గి చెట్టు పిక్కల పొడి కలిపినట్టు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. కల్లు చెట్టు వివాదాల కారణంగా.. అబ్బాయిను చంపేందుకు బాబాయ్ కుట్ర పన్నాడు. సహదేవ్ ను హత్య చేసేందుకు చెట్టుకున్న కల్లులో పిక్కల పొడి కలిపాడు బాబాయ్ త్రినాధరావు. ఇది తెలియని రామదాసు.. సహదేవ్ వద్ద కళ్ళు కొనుగోలు చేసి.. ఇంటికి వచ్చిన బంధువులను తాగించాడు. కల్లు తాగిన రామదాసు అతని ఇంటికి వచ్చిన బంధువులు… తాగిన కొద్దిసేపటికి వాంతులు విరోచనాలతో అస్వస్థత గురయ్యారు. ఈనెల 7న ఆసుపత్రిలో రామదాసు కొడుకు లోవరాజు మృతిచెందాడు. ఒకరి హత్యకు ప్లాన్ చేసి… మరొకరి మృతికి కారకుడైన త్రినాధరావును అరెస్టు చేసారు పోలీసులు.
Reporter : khaja
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..