AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambati Rambabu: మూడు రాజధానులు చేసి తీరుతాం.. అదే వైసీపీ విధానం.. మంత్రి అంబటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

మూడు రాజధానులపై సందేహం అవసరం లేదని.. వైసీపీ విధానం మూడు రాజధానుల వైపేనని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. సమతౌల్యత కోసమే మూడు రాజధానులు అని స్పష్టం చేశారు. విజయవాడలో..

Ambati Rambabu: మూడు రాజధానులు చేసి తీరుతాం.. అదే వైసీపీ విధానం.. మంత్రి అంబటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Minister Ambati Rambabu
Ganesh Mudavath
|

Updated on: Feb 15, 2023 | 12:38 PM

Share

మూడు రాజధానులపై సందేహం అవసరం లేదని.. వైసీపీ విధానం మూడు రాజధానుల వైపేనని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. సమతౌల్యత కోసమే మూడు రాజధానులు అని స్పష్టం చేశారు. విజయవాడలో భూగర్భ జలవనరుల డేటా సెంటర్ ను ప్రారంభించిన అనంతరం మంత్రి అంబటి రాంబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అనే స్ధానిక భావాలున్నాయన్న మంత్రి.. వాటిని వదులుకోకూడదనే మూడు రాజధానుల వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. వారాహి ఏది.. ఎక్కడ.. ఆ సినిమా ఆపారా అని మండిపడ్డారు. అవగాహన ఉండి రాజకీయ విమర్శలు చేయాలని సూచించారు. లోకేశ్, పవన్ లకు నిబద్ధత లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

లోకేశ్ తెలుగు వాడుక భాష మాట్లాడలేడు. తెలుగు మాట్లాడలేని వారు టీడీపీ వారసులా. ఇదేనా రాష్ట్రానికి చంద్రబాబు చెప్పిన ఖర్మ. లోకేశ్ పాదయాత్రతో టీడీపీ మరింత పతనం అవుతుంది. అచ్చెన్నాయుడు ఎందుకు లోకేశ్ పాదయాత్ర పెట్టారా అని తలలు పట్టుకుంటున్నారు. 40 లక్షల ఎకరాలు రాష్ట్రంలో భూగర్భజలాల మీద ఆధారపడి ఉన్నాయి. ఏ పంటలకు అనుకూలంగా ఉండే జలాలు ఉన్నాయో ఇక్కడి ల్యాబ్ నిర్ణయిస్తుంది. ఏలూరు, విజయవాడ, చిత్తూరు, విశాఖ లలో డేటా సెంటర్లు ఏర్పాటు చేశాం. 16.5 కోట్లతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం..

– అంబటి రాంబాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రి

ఇవి కూడా చదవండి

కాగా.. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు లేవని.. ఒకే ఒక రాజధాని విశాఖ మాత్రమే అని ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబు మూడు రాజధానుల ప్రకటన చేయడం ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం