Andhra Pradesh: నమ్మించాడు.. కుచ్చుటోపీ పెట్టాడు.. చిట్టీల పేరుతో ఏకంగా రూ.5 కోట్లకు పైగానే..
సాలూరు చిట్టీల మోసం కేసులో రోజురోజుకు బాధితుల సంఖ్య రెట్టింపవుతుంది. ఐదు కోట్లకు పైగా మోసం చేసి ఉడాయించాడని చెప్తున్నారు బాధితులు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో చిట్టీల మోసం ఘటనలో రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుంది.
సాలూరు చిట్టీల మోసం కేసులో రోజురోజుకు బాధితుల సంఖ్య రెట్టింపవుతుంది. ఐదు కోట్లకు పైగా మోసం చేసి ఉడాయించాడని చెప్తున్నారు బాధితులు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో చిట్టీల మోసం ఘటనలో రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుంది. సుమారు 130 మందికి పైగా కస్టమర్స్ నుండి ఐదు కోట్ల మేర కాజేసి ఉడాయించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. చిట్టీలు నడుపుతున్న సోమశేఖర్ గత కొద్ది రోజులుగా కనపడకపోవడంతో డబ్బు కట్టి మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఆందోళనకు దిగారు. తాము తీవ్రంగా నష్టపోయామంటూ పోలీసులను ఆశ్రయించారు భాదితులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడ్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక బృందంతో గాలింపు చేపట్టారు. సోమశేఖర్ ఘరానా మోసం వెలుగులోకి రావడంతో భాదితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. సాలూరు పట్టణంలో చిట్టీల వ్యాపారి మండవిల్లి సోమశేఖర్ అనే వ్యక్తి నమ్మకంగా ఉంటూ పట్టణానికి చెందిన అనేకమంది పేద, మధ్యతరగతి ప్రజలతో కొన్నాళ్లుగా చిట్టీ కట్టిస్తున్నాడు. పిల్లల పెళ్లి, చదువు కోసమని అనేక మంది అతని దగ్గర చిట్టీలు వేశారు. కుటుంబ పోషణ ఖర్చులు పోగా మిగిలిన డబ్బును నెలనెలా చిట్టీ కడితే ఆ డబ్బు అవసరాలకు పనికొస్తుందని చాలామంది భావించారు. వీరిలో కూలీలు, కార్మికులు, చిరువ్యాపారులు ఎక్కువ మంది ఉన్నారు.
మొదట్లో కొన్నాళ్లపాటు డబ్బులు సక్రమంగానే చెల్లించడంతో చాలా మందికి నమ్మకం కలిగి ఎక్కువ మొత్తంలో కట్టారు. అయితే కొద్దిరోజుల నుంచి ఆయన కనిపించకపోవడంతో బాధితులు లబోదిబోమంటూ సాలూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సీఐ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు నిందితుడ్ని పట్టుకొని తమ డబ్బు ఇప్పించాలని పోలీసులను వేడుకుంటున్నారు.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం ఇక్కడ.. క్లిక్ చేయండి..