Minister Roja: లోకేశ్ అంకుల్ ఒక ఐరన్ లెగ్.. అడుగు పెడితేనే అరిష్టం.. మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు..
టీడీపీ లీడర్ నారా లోకేశ్ పై మంత్రి రోజా మరోసారి ఫైర్ అయ్యారు. లోకేశ్ అంకుల్ ఒక ఐరన్ లెగ్ అని ఎద్దేవా చేశారు. లోకేశ్ చేస్తోంది పాదయాత్ర కాదన్న మంత్రి.. "జోకేశ్" యాత్ర అని ఎద్దేవా చేశారు. లోకేశ్ రాజకీయ..
టీడీపీ లీడర్ నారా లోకేశ్ పై మంత్రి రోజా మరోసారి ఫైర్ అయ్యారు. లోకేశ్ అంకుల్ ఒక ఐరన్ లెగ్ అని ఎద్దేవా చేశారు. లోకేశ్ చేస్తోంది పాదయాత్ర కాదన్న మంత్రి.. “జోకేశ్” యాత్ర అని ఎద్దేవా చేశారు. లోకేశ్ రాజకీయ ఎంట్రీతోనే చంద్రబాబు పతనం స్టార్ట్ అయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర కోసమని ముందురోజు రాత్రి ఏడు గంటలకే నగరి నియోజకవర్గంలోకి వచ్చిన లేకేశ్.. ఆ తరువాతి రోజు ఉదయం ఆరు గంటల వరకు పాదయాత్రకు జనాలు రాక టెంటులోనే పడుకున్నారని ఆక్షేపించారు. లోకల్ నుంచి జనాలు రాకపోవడంతో బెంగుళూరు, చెన్నై నుంచి అప్పటికప్పుడు జనాన్ని తెచ్చుకుని ఏదో హడావిడి చేశారని ఎద్దేవా చేశారు. తమ కుటుంబంలో కొందరి పేర్లు చెప్పి.. అవినీతికి పాల్పడ్డామంటూ లోకేశ్ కామెంట్లు చేశారన్న మంత్రి రోజా.. లోకేశ్ కు తన గురించి గానీ, తన ఫ్యామిలీ గురించి గానీ మాట్లాడే అర్హత లేదని ఫైర్ అయ్యారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే.. అది నారా కుటుంబమేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏ కేసు పెట్టినా స్టేలు తెచ్చుకుని తప్పించుకుని తిరిగే అలవాటున్న చంద్రబాబుకు, లోకేశ్‌కు ఒక సవాల్ విసురుతున్నాను. మీ ఆస్తుల మీద.. నా ఆస్తుల మీద సీబీఐతో ఎంక్వైరీ చేయించడానికి సిద్ధమేనా..?. హైదరాబాద్‌లో ఉన్న మీ ఇంటికి డబ్బు సంచులు ఏ విధంగా వచ్చాయో బయటకొస్తే చాలు.. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు పరిస్థితి జీరోకి దిగజారుతుంది. కనీసం కిందటి సారి దక్కించుకున్న 23 సీట్లు కూడా గల్లంతవడం ఖాయం. ఇప్పటికైనా లోకేశ్, చంద్రబాబు ఇష్టానుసారంగా నోరుపారేసుకోవడం ముగించాలి. ఈ రాష్ట్రానికి టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది. ప్రస్తుత సీఎం జగన్.. చేస్తున్న అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. గడప గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
– రోజా, ఆంధ్రప్రదేశ్ మంత్రి
లోకేశ్ అడుగుపెట్టిన దగ్గర నుంచి రాష్ట్రానికి, ఎన్టీఆర్ కుటుంబానికి ఏదో ఒక అరిష్టం జరుగుతూనే ఉందని మంత్రి రోజా ఆక్షేపించారు. లోకేశ్ ఐరన్ లెగ్ తో పాదయాత్ర అనగానే జనాలు భయపడి బయటకు రాకుండా ఇళ్లకు తలుపులేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జబర్దస్త్ అనేది మంచి ఆరోగ్యకర, ఆహ్లాదకరమైన కామెడీ షో.. దాన్ని కూడా ఒక బూతు కార్యక్రమంగా లోకేశ్ మాట్లాడుతున్నారంటే ఆయన పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం ఇక్కడ..