Jagapathi Babu: ఆ సినిమా షూటింగ్‌లో వారం రోజుల పాటు అన్నం పెట్టలేదు.. లైట్‌బాయ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు: జగ్గూభాయ్
సినిమాల సంగతి పక్కన పెడితే.. నిజజీవితంలో జగపతిబాబు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. ఏవిషయంపైనేనా ముక్కుసూటిగా మాట్లాడతారు. ఈ లక్షణాలే ఆయనకు సపరేట్ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టాయి.
ఒకప్పుడు టాలీవుడ్‌లో ఫ్యామిలీ సినిమాలకు జగపతిబాబు పెట్టింది పేరు. మావిడాకులు, శుభలగ్నం, ఆయనకు ఇద్దరు, పెళ్లిపీటలు, మనోహరం, బడ్జెట్ పద్మనాభం తదితర కుటుంబ కథా చిత్రాలు ఆయన కెరీర్‌లో ఉన్నాయి. అలా ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు పొందిన జగ్గూబాయ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ దూసుకుపోతున్నారు. విలన్‌గా, తండ్రిగా, సపోర్టింగ్ రోల్స్‌తో వరుస సినిమాలు చేస్తున్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. నిజజీవితంలో జగపతిబాబు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. ఏవిషయంపైనేనా ముక్కుసూటిగా మాట్లాడతారు. ఈ లక్షణాలే ఆయనకు సపరేట్ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టాయి. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ నటుడు.. ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు.
నేను అలా అడగలేను..
‘అడగందే అమ్మయినా అన్నం పెట్టదు. సినిమా ఇండస్ట్రీలో కూడా అడగాలి.. కానీ అడుకున్నట్లు మాత్రం ఉండకూడదు. నాకు అలా చేయడం రాదు. అందుకే చులకనగా చేస్తారు. ఆ జగపతి బాబే కదా.. వస్తాడు, చేస్తాడు. డబ్బుల కోసం కాదు అనే చులకన భావం ఉంటుంది. దీనిని కొందరు టెకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారు. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 35 ఏళ్లవుతోంది. నాకు సినిమా తప్ప మరే విషయం తెలియదు. నాకు బాగా గుర్తుండిపోయిన ఒక చేదు సంఘటన చెబుతాను. సాహసం సినిమాలో నేను సెకండ్ హీరో. ఆ మూవీ షూటింగ్‌లో ఏడు రోజులపాటు నాకు తిండిపెట్టలేదు, కనీసం తింటారా? అని కూడా ఎవ్వరూ అడగలేదు. కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా వేయలేదు. అప్పుడు లైట్‌బాయ్ కూడా నా దగ్గరకు వచ్చి నా పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. జీవితంలో ముందే కష్టాలను చూస్తే ఆ తర్వాత మిగతా లైఫ్ సాఫీగా సాగిపోతుందని నా నమ్మకం. అందుకే అన్నిటినీ భరించాను’ అని చెప్పుకొచ్చారు జగ్గూభాయ్
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..