- Telugu News Photo Gallery Cricket photos Team India's Deepti Sharma create record against Pakistan in women's T20 World Cup
పాక్‌తో మ్యాచ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన టీమిండియా ప్లేయర్.. ధోని, కోహ్లీ, రోహిత్‌లకు కూడా సాధ్యం కాలేదుగా..
పాక్‌తో మ్యాచ్ ద్వారా ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది టీమిండియా స్టార్ స్పిన్నర్ దీప్తిశర్మ. అదేంటంటే.. వరుసగా 50కి పైగా టీ20 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా ఆమె రికార్డు సృష్టించింది.
Updated on: Feb 13, 2023 | 4:09 PM

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 12) భారత్- పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.

పాక్‌తో మ్యాచ్ ద్వారా ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది టీమిండియా స్టార్ స్పిన్నర్ దీప్తిశర్మ. అదేంటంటే.. వరుసగా 50కి పైగా టీ20 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా ఆమె రికార్డు సృష్టించింది.

కాగా పురుషుల క్రికెట్‌లో దిగ్గజాలుగా చెప్పుకునే మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతో పాటు ఎవరూ ఈ రికార్డును అందుకోలేకపోవడం గమనార్హం.

దీప్తి 2016 నుంచి 2021 వరకు వరుసగా 54 వన్డేలు ఆడింది. అదే సమయంలో 2020 నుండి 2023 23 వరకు వరుసగా 50 టీ20 మ్యాచ్‌లు ఆడింది.

అయితే ఈ లిస్టులో 56 టీ20 మ్యాచ్‌లతో స్మృతి మంధాన మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం దీప్తితో కలిసి తాన్యా భాటియా సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది.





























