- Telugu News Photo Gallery Cricket photos IND vs AUS 1st Test Rohit Sharma equals Sachin Tendulkar Centuries Record against Tendulkar's record against Australia
Rohit Sharma: సచిన్ రికార్డును సమం చేసిన హిట్‌మ్యాన్.. ఆ జట్టుపై రోహిత్ ఇంకో సెంచరీ చేస్తే లెక్కలు తిరగరాయాల్సిందే..
రోహిత్ శర్మ రికార్డ్: నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ కనబర్చాడు. ఈ సెంచరీతో హిట్‌మ్యాన్ పలు రికార్డులను నెలకొల్పాడు.
Updated on: Feb 12, 2023 | 1:10 PM

రోహిత్ శర్మ రికార్డ్: నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ కనబర్చాడు. ఈ సెంచరీతో హిట్‌మ్యాన్ పలు రికార్డులను నెలకొల్పాడు.

నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించారు.

విశేషమేమిటంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అద్భుత సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన హిట్‌మన్ 212 బంతుల్లో 2 సిక్సర్లు, 15 ఫోర్లతో 120 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో హిట్ మ్యాన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెంచరీ రికార్డును కూడా సమం చేయడం విశేషం.

అంటే.. ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీ సాధించిన టీమిండియా ఓపెనర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. ఆస్ట్రేలియాపై ఓపెనర్‌గా సచిన్ టెండూల్కర్ 9 సెంచరీల రికార్డు సృష్టించాడు.

ఇప్పుడు ఈ రికార్డును హిట్‌మ్యాన్ సమం చేయడం విశేషం. ఆసీస్‌పై వన్డేల్లో 8 సెంచరీలు చేసిన రోహిత్ శర్మ, ఇప్పుడు టెస్టుల్లో కూడా 1 సెంచరీ పూర్తి చేశాడు. దీంతో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును మాస్టర్ బ్లాస్టర్ రికార్డులను రోహిత్ సమం చేసినట్లయింది.

ఈ క్రమంలో ఆసీస్ జట్టుపై రోహిత్ శర్మ మరో సెంచరీ కనుక చేస్తే.. సచిన్‌ను అధిగమించి, ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు చేసిన భారత్ ఓపెనర్‌గా హిట్‌మ్యాన్ రికార్డు సృష్టిస్తాడు.





























