- Telugu News Photo Gallery Cricket photos Rohit Sharma Surpasses Sachin Tendulkar and Virendra Sehwag as he scored most centuries as an Opener for India
Rohit Sharma: సచిన్-సెహ్వాగ్ రికార్డులను బద్దలు కొట్టిన హిట్‌మ్యాన్.. ఆ జాబితాలో ప్రథమ స్థానంలోకి..
రోహిత్ శర్మ రికార్డులు: నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఆసీస్‌పై 212 బంతుల్లో 2 సిక్సర్లు, 15 ఫోర్లతో 120 పరుగులతో చెలరేగాడు. ఫలితంగా అనేక రికార్డులు బద్దలయ్యాయి.
Updated on: Feb 12, 2023 | 10:16 AM

విశేషమేమిటంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అద్భుత సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన హిట్‌మన్ 212 బంతుల్లో 2 సిక్సర్లు, 15 ఫోర్లతో 120 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో హిట్ మ్యాన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెంచరీ రికార్డును కూడా సమం చేయడం విశేషం.

ఈ క్రమంలో ఆసీస్ జట్టుపై రోహిత్ శర్మ మరో సెంచరీ కనుక చేస్తే.. సచిన్‌ను అధిగమించి, ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు చేసిన భారత్ ఓపెనర్‌గా హిట్‌మ్యాన్ రికార్డు సృష్టిస్తాడు.

గతంలో ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. భారత ఓపెనర్‌గా సచిన్ టెండూల్కర్ మొత్తం 19 సెంచరీలు సాధించాడు.

ఓపెనర్‌గా బరిలోకి దిగే వీరేంద్ర సెహ్వాగ్ కూడా మొత్తం 18 సెంచరీలు చేశాడు. ఈ ఇద్దరు దిగ్గజాలను ఇప్పుడు హిట్ మ్యాన్ అధిగమించడం విశేషం.

ఈ ఏడాది భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటి వరకు మొత్తం 8 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 9 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన అతను 56.77 సగటుతో మొత్తం 511 పరుగులు జోడించాడు. ఇందులో అతను 2 సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. 2023లో ఇప్పటివరకు, టీమ్ ఇండియాకు అత్యధికంగా పరుగులు అందించడంలో రోహిత్ శర్మ నంబర్ టూలో ఉన్నాడు. యంగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ 769 పరుగులతో నంబర్ వన్‌లో ఉన్నాడు.


నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించారు.





























