Venkata Chari |
Updated on: Feb 13, 2023 | 7:04 AM
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న SA20 లీగ్ ఫైనల్‌లో 38 ఏళ్ల స్పిన్నర్ తుఫాన్ బ్యాట్స్‌మెన్స్‌తో నిండిన ప్రిటోరియా క్యాపిటల్స్ పరిస్థితిని చావుదెబ్బ తీశాడు.
ఫిబ్రవరి 12, ఆదివారం జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన టీ20 లీగ్ మొదటి సీజన్ ఫైనల్‌లో, సన్‌రైజర్స్ ఈస్ట్ కేప్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రోలోఫ్ వాన్ డెర్ మెర్వే తన స్పిన్‌తో చుక్కలు చూపించాడు. ప్రిటోరియా జట్టు టైటిల్ మ్యాచ్‌లో 136 పరుగులు మాత్రమే చేయగలిగింది.
రోలోఫ్ వాన్ డెర్ మెర్వే తన 4 ఓవర్లలో 31 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ప్రిటోరియా టాప్, మిడిల్ ఆర్డర్‌ను చిత్తు చేశాడు. ఈ క్రమంలో అతను 18వ ఓవర్ చివరి రెండు బంతుల్లో వరుసగా రెండు వికెట్లు తీశాడు. 19వ ఓవర్ తొలి బంతికి సిసంద మగల వికెట్ తీసి జట్టు హ్యాట్రిక్ పూర్తి చేశాడు.
ప్రిటోరియా జట్టు పూర్తి 20 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. 3 బంతులు మిగిలి ఉండగానే 136 పరుగుల వద్ద కుప్పకూలాయి. కుశాల్ మెండిస్ మాత్రమే 20 పరుగుల మార్కును దాటగలిగాడు.
రిలే రస్సో తుఫాన్ బ్యాటింగ్ చేసినా, 11 బంతుల్లో 19 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో ప్రిటోరియా భారీ స్కోరు చేయలేకపోయాడు.