Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి గొప్ప మనసు చాటుకున్న బాలయ్య.. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోన్నఅసిస్టెంట్‌ డైరెక్టర్‌ కోసం ఏకంగా..

క్యాన్సర్‌ విషయంలో తన కన్నతల్లికి జరిగినట్లు మరెవరికీ జరగకూడదనే ఉద్దేశంతో బాలయ్య ఈ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ ఆస్పత్రి ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందిస్తూ తన వంతు సహాయం చేస్తున్నారు.

మరోసారి గొప్ప మనసు చాటుకున్న బాలయ్య.. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోన్నఅసిస్టెంట్‌ డైరెక్టర్‌ కోసం ఏకంగా..
Nandamuri Balakrishna
Follow us
Basha Shek

|

Updated on: Feb 12, 2023 | 8:04 PM

నందమూరి బాలకృష్ణ.. పైకి కటువుగా కనిపిస్తారు కానీ ఆయన మనసు బంగారం. అందుకే ఆయన అభిమానులు ‘జై బాలయ్య’ అని గర్వంగా చెప్పుకుంటారు. స్టార్‌ హీరోగా, ఎమ్మెల్యేగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ అండగా నిలుస్తుంటారు బాలయ్య. సినిమాలు, పాలిటిక్స్‌తోనే కాకుండా బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి అధినేతిగా ఇప్పటికే ఎంతోమందికి ఆపన్నహస్తం అందించారాయాన. క్యాన్సర్‌ విషయంలో తన కన్నతల్లికి జరిగినట్లు మరెవరికీ జరగకూడదనే ఉద్దేశంతో బాలయ్య ఈ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ ఆస్పత్రి ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందిస్తూ తన వంతు సహాయం చేస్తున్నారు. ఇక పేదలకు సొంత ఖర్చులతో ఆస్పత్రి బిల్లులు కూడా చెల్లిస్తున్నారు. తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారీ నందమూరి నటసింహం. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్‌కు చెందిన ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బ్రెయిన్‌ ట్యూమర్‌ బారిన పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అతనికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఉచిత వైద్యం అందించి ప్రాణాలు కాపాడారట. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. స్టార్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను వద్ద మహేష్ యాదవ్ అనే ఒక వ్యక్తి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నాడు. రామ్‌చరణ్‌ వినయ విధేయ రామ సినిమాకు అతను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే ఇటీవల అతనికి ఆరోగ్యం సరిగా లేక పోవడంతో ఆస్పత్రిలో చెక్ చేయిస్తే బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని తేలింది.

బ్రెయిన్ ట్యూమర్ నయం కావాలంటే సుమారు రూ.40 లక్షలు అవుతాయని వైద్యులు చెప్పారట. అయితే బోయపాటి ద్వారా మహేశ్‌ విషయం తెలుసుకున్న బాలయ్య ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యేలా చర్యలు తీసుకున్నారట. అంతేకాదు ఉచితంగా చికిత్స చేయించారట. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ‘మా బాలయ్య మనసు బంగారం’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..