Kantara 2: కాంతార 2లో ఊర్వశీ రౌటేలా ?.. ఫోటో వెనుక అసలు విషయం చెప్పిన మేకర్స్..
దీంతో ఈ మూవీ సిక్వెల్ చేయబోతున్నట్లు గతంలో ప్రకటించారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను సెలెక్ట్ చేశారని టాక్.
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా తెలుగులో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో బాస్ పార్టీ అంటూ స్పెషల్ సాంగ్ లో చిందులేసింది. ఈ పాట బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తెలుగులో అమ్మడి క్రేజ్ మరింత పెరిగింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరలవుతుంది. గతేడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన చిత్రాల్లో కాంతార ఒకటి. కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెక్కించిన ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీ సిక్వెల్ చేయబోతున్నట్లు గతంలో ప్రకటించారు మేకర్స్. అయితే తాజాగా కాంతార 2 ఓ కీలకపాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను సెలెక్ట్ చేశారని టాక్.
ఇటీవల బెంగుళూరులోని హోంబలే ఫిలింస్ ఆఫీసులో హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టిని కలిసిన పిక్ షేర్ చేసింది. దీంతో ఈ సినిమాలో ఊర్వశీ కీలకపాత్రలో కనిపించనుందంటూ టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ వార్తలపై మేకర్స్ స్పందించించినట్లుగా సమాచారం. కాంతార 2లో తాను నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలన్ని అవాస్తవమని.. కేవలం రిషబ్ శెట్టిని కలిసినందుకు మాత్రమే ఆ పిక్ షేర్ చేసిందట. కాంతార లోడింగ్ అంటూ క్యాప్షన్ ఇవ్వడమనేది ఆ సందర్భానికి తగినది మాత్రమే అంటూ హోంబలే ఫిల్మ్ వర్గాలు తెలిపాయట.
రిషబ్ శెట్టి ‘కాంతార’కి ప్రీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా జూన్ నెలలో సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
#KANTARA 2 @shetty_rishab @hombalefilms loading ……???????? #RS
☆
☆
☆
☆
☆
☆
☆
☆
#love #UrvashiRautela #UR1 #RishabShetty #kantara pic.twitter.com/j3pD8OGtTh
— URVASHI RAUTELA?? (@UrvashiRautela) February 11, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.