Hansika Motwani : ‘నా భర్త విడాకులకు నేను కారణం కాదు.. అతని గతం నాకు తెలుసు’.. హీరోయిన్ హాన్సిక ఎమోషనల్..

తన పెళ్లి వేడుకను లవ్ షాదీ డ్రామా పేరుతో ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేస్తుంది. అయితే తన పెళ్లికి ముందు.. ప్రేమ విషయంలో జరిగిన అనుభవాలను ఈ డ్రామాలో వెల్లడించింది.

Hansika Motwani : 'నా భర్త విడాకులకు నేను కారణం కాదు.. అతని గతం నాకు తెలుసు'.. హీరోయిన్ హాన్సిక ఎమోషనల్..
Hansika
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 11, 2023 | 4:00 PM

దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ హాన్సిక మోత్వాని. ఆ తర్వాత ఈ అమ్మడు హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ చేస్తూ ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకుంది. కానీ కొద్దిరోజులుగా అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అయితే డిజిటల్ ప్లాట్ ఫాంపై సందడి మాత్రం కాస్త ఎక్కువగానే చేస్తోంది. అయితే గతేడాది డిసెంబర్ 4న మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. తన స్నేహితుడు వ్యాపారవేత్త అయిన సోహైల్ కతూరియాతో హాన్సిక వివాహం జరిగింది. జైపూర్ లోని ముండోతా కోటలో ఇరు కుటుంబసభ్యులు.. సన్నిహితుల సమక్షంలో వేడుక ఘనంగా జరిగింది. వీరి ప్రేమ, పెళ్లి ఇప్పుడు సిరీస్ గా రాబోతుంది. తన పెళ్లి వేడుకను లవ్ షాదీ డ్రామా పేరుతో ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేస్తుంది. అయితే తన పెళ్లికి ముందు.. ప్రేమ విషయంలో జరిగిన అనుభవాలను ఈ డ్రామాలో వెల్లడించింది.

తాను పెళ్లి చేసుకునే వరకు వివాహం.. తన భర్త గురించి ఎవరికి తెలయకూడదు అనుకుందట. అంతా అత్యంత సీక్రెట్ గా ఉండేందుకు ప్రయత్నించినట్లుగా తెలిపింది. కానీ మీడియాకు ముందే లీకై తన పెళ్లి గురించి అనేక వార్తలు రావడంతో తీవ్ర అసహనానికి గురైనట్లు తెలిపింది. అలాంటి సమయంలో తనకు ఆమె తల్లి అన్ని విధాలా సాయం చేసిందని.. తన భర్తకు గతంలోనే పెళ్లై.. విడాకులు కూడా తీసుకున్నారని.. అందుకు కారణం హాన్సికనే అంటూ వార్తలు రావడం తనను భాదించాయని తెలిపింది.

“నా పెళ్లి అయ్యే అన్ని విషయాలను రహస్యంగా ఉంచాలనుకున్నాను. నాకు తెలియకుండానే పెళ్లి వార్తలు బయటకొచ్చాయి. అది నాకు నచ్చలేదు. సోహైల్ గురించి వార్తలు వచ్చినప్పుడు చాలా ఒత్తిడికి గురయ్యాను. ఆ సమయంలో మా అమ్మ.. నా సోదరుడి సలహాతో ఫస్ట్ టైం మా ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేశాను. వాటిని అందరూ కంగ్రాట్స్ చెప్పడంతో చాలా హ్యాప్పీగా ఫీలయ్యాను. ఆ తర్వాత కొద్ది రోజులకు సోహైల్ కు గతంలోనే పెళ్లి అయ్యిందని.. అతని వివాహానికి నేను వెళ్లిన ఫోటోస్ షేర్ చేస్తూ.. వారిద్దరు విడిపోవడానికి కారణం నేనే అని రాశాను. నాకు అతని గతం తెలుసు.. కానీ వారు విడాకులు తీసుకోవడానికి నేను కారణం కాదు” అంటూ ఎమోషనల్ అయ్యింది హాన్సిక.

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!