Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: చురకత్తుల్లాంటి కళ్లు.. దేశపు జెండాకున్న పొగరు… ఎగసిపడే ఆవేశం.. ఎవరితను..?

ఆ పేరులోనే ఏదో మ్యాజిక్ ఉంది.. అందుకే ఆయనంటే అంత అభిమానం. ఆయన ఫ్యాన్స్ తక్కువ.. భక్తులే ఎక్కువ...

Viral: చురకత్తుల్లాంటి కళ్లు.. దేశపు జెండాకున్న పొగరు... ఎగసిపడే ఆవేశం.. ఎవరితను..?
Hero Childhood Photo
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 11, 2023 | 3:38 PM

సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలతో ఇప్పుడు సోషల్ మీడియా హోరెత్తుతుంది. ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు స్టార్స్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట అలా వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఫోటోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఈయన ఎవరో మీరు గెస్ చేయగలరా..?  గెలుపోటములతో సంబంధం లేదు.. హిట్టు ఫ్లాపులతో నిమిత్తం లేదు.. చేయాలనుకున్న పని చేస్తుంటారు.. వెళ్లాలనుకున్న దారిలో వెళ్తుంటారు. ఒక్కోసారి అందరిలా ఉండకపోవడమే.. అందరినీ చేరువ చేస్తుంది. కెరీర్ మొదటి నుంచి ఆయన చేస్తున్నదిదే.  ఆయన ఓ సినిమాలో చెప్పినట్టు ట్రెండ్ ఫాలో అవ్వరు.. ట్రెండ్ సెట్ చేస్తారు. ఏంది ఈ మాటలు చదివాక ఆయన ఎవరో తెలియదంటే మాత్రం.. హాస్యాస్పదమే అవుతుంది. కొన్ని పేర్లకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. బ్రాండ్ చాలు. హీ ఈజ్ నన్ అదర్‌దెన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్.

పవన్ ఎలాంటి స్టార్.. ఆయన ఫ్యాన్స్ బేస్ ఎంత..? ఆయన స్థాయి ఏంటన్నది తెలుగు ప్రజలకు స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. అన్న చాటు తమ్ముడిగా వచ్చిన పవన్ కళ్యాణ్.. అన్నను మించిన తమ్ముడుగా ఎదిగారు. అయినా అన్న ముందు ఎప్పటికీ ఒదిగే ఉంటారు. హిట్టు, ఫ్లాఫ్ ఎఫెక్ట్ ఉండని ఏకైన స్టార్ పవన్. ఖుషీ తర్వాత ఒక్క మూవీ కూడా సూపర్ హిట్ అవ్వలేదు.  వరసగా అపజయాలను చూసిన పవన్.. ఒక్క హిట్ కోసం ఎన్నో ఏళ్లు వేచి చూసారు. అయినా కూడా ఈయన ఇమేజ్ చెక్కుచెదరలేదు. హీరోగా టాప్ రేస్‌లో ఉండగానే.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పవన్. 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో డైరెక్ట్‌గా ఎన్నికల బరిలో దిగినా.. పార్టీ చతికిలపడింది. అధ్యక్షుడు పవనే పోటీ చేసిన 2 చోట్లా ఓడిపోయారు. అయినా ఆత్మస్థైర్యం కోల్పోలేదు. అటు సినిమాలు, ఇటు పాలిటిక్స్‌ బ్యాలెన్స్  చేస్తూ ముందకు సాగుతున్నారు.

తనకు ప్రాణం ఉన్నంత వరకు పార్టీని నడిపిస్తానని పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. తన పార్టీని విలీనం చేయడం జరగదని ప్రకటించారు. తననేమి గుడ్డిగా నమ్మొద్దని కోరారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. తనపై ఉంచిన నమ్మకాన్ని ఎన్నికల వరకు అలాగే ఉండేలా చూడాలని పవన్‌ కళ్యాణ్‌ కోరుతున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి