AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18 Pages Movie: ఆ సీన్స్ ఉంటే సినిమా మరింత అద్భుతంగా ఉండేది.. ’18 పేజెస్’ చిత్రంపై పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ..

ఫస్టాఫ్ చాలా అద్భుతంగా ఉందని.. కానీ సెకండ్ పార్ట్ లో కొన్ని మార్పులు చేసి ఉంటే మరింత బాగుండేదని అన్నారు. అలాగే కొన్ని సీన్స్ యాడ్ చేసి ఉంటే సినిమా అత్యద్భుతంగా ఉండేదని అన్నారు.

18 Pages Movie: ఆ సీన్స్ ఉంటే సినిమా మరింత అద్భుతంగా ఉండేది.. '18 పేజెస్' చిత్రంపై పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ..
18 Pages
Rajitha Chanti
|

Updated on: Feb 11, 2023 | 5:10 PM

Share

ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ జోడి అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నిఖిల్, అనుపమ. కార్తీకేయ 2 చిత్రంతో జత కట్టిన వీరిద్దరూ.. ఆ తర్వాత 18 పేజెస్ సినిమాతో మరోసారి అలరించారు. వీరు కలిసి నటించిన ఈ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్స్ హిట్స్ అయ్యాయి. కార్తీకేయ 2 సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న వీరు.. ఆ తర్వాత అందమైన ప్రేమకథ 18 పేజిస్ థియేటర్లలో సందడి చేశారు. డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసిన ఈ చిత్రానికి అక్కడ కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలిపారు. ఫస్టాఫ్ చాలా అద్భుతంగా ఉందని.. కానీ సెకండ్ పార్ట్ లో కొన్ని మార్పులు చేసి ఉంటే మరింత బాగుండేదని అన్నారు. అలాగే కొన్ని సీన్స్ యాడ్ చేసి ఉంటే సినిమా అత్యద్భుతంగా ఉండేదని అన్నారు.

“18 పేజెస్.. టైటిల్ విన్నప్పుడు కాస్త కొత్తగా అనిపించింది. కానీ.. ఒక అమ్మాయి రాసుకున్న డైరీలోని 18 పేజీలు అనే విషయం చిత్రం చూసేవరకు ప్రేక్షకులకు తెలియదు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్” అనే అంశాన్ని ఈ సినిమాతో మరోసారి తెలియజేశారు డైరెక్టర్. అలాగే ఒక వ్యక్తికి తన ఊహా సుందరి కళ్ల ముందు కనపడితే ఎలా ఉంటుందనేది ఈ సినిమా కథాబీజం. డైరెక్టర్ సూర్య ప్రతాప్ దీన్ని ఛాలెంజింగ్ గా తెరకెక్కించారు. ఓ అమ్మాయి వల్ల మోసపోయిన హీరో.. అదే సమయంలో మరో అమ్మాయి రాసుకున్న డైరీని చదవి.. ఆమెను చూడకుండానే తనతో ప్రేమలో పడడం అనే అంశాలతో ఫస్టాఫ్ చూడచక్కగా రూపొందించారు. కానీ సెకండ్ హాఫ్ లో సాంఘిక కోణలో చిత్రాన్ని చూపించారు. ఇలా ఫస్ట్ హాఫ్.. సెకండ్ పార్ట్ అంటున్నందుకు క్షమించాలి.

ప్రీ క్లైమాక్స్, హీరో, హీరోయిన్స్ ఎప్పుడు? ఎక్కడ కలిశారు? అనే సీన్స్ మరి ఇంకాస్త వివరణాత్మకంగా చూపించి ఉంటే సినిమా అత్యద్భుతంగా ఉండేది. ఇదే విషయాన్ని దర్శకుడితో చెప్పాను.. కానీ సమయం లేకపోవడం వలన కొన్ని సీన్స్ తొలగించినట్లు తెలిపారు. అలా కాకుండా ఉండి ఉంటే సినిమా మరింత బాగుండేది ” అంటూ చెప్పుకొచ్చారు పరుచూరి. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించారు.