- Telugu News Photo Gallery Cinema photos Actress Ashika Ranganath Says She will not Forget Kannada After tollywood entry telugu cinema news
Ashika Ranganath: ‘టాలీవుడ్‌కి వెళ్లినంత మాత్రాన కన్నడ ఇండస్ట్రీని మర్చిపోను’.. నెటిజన్ ప్రశ్నకు ఆషికా రంగనాథ్ కౌంటర్..
కన్నడ సోయగం ఇప్పుడు టాలీవుడ్ వెండితెరపై సందడి చేస్తోంది. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఆషికా రంగనాథ్.
Updated on: Feb 12, 2023 | 9:25 PM

కన్నడ సోయగం ఇప్పుడు టాలీవుడ్ వెండితెరపై సందడి చేస్తోంది. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఆషికా రంగనాథ్.

ఫిబ్రవరి 10న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే తొలి చిత్రంతోనే తెలుగులో హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడుకు వరుస అవకాశాలు క్యూ కట్టనున్నట్లుగా తెలుస్తోంది.

దీంతో ఆమె కన్నడ చిత్రపరిశ్రమను మర్చిపోతుందని.. ఇకపై తెలుగులోనే స్థిరపడిపోతుందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీటిపై క్లారిటీ ఇచ్చింది ఆషికా.

తెలుగులో ఎన్ని చిత్రాలు చేసినా ఎప్పటికీ కన్నడ ఇండస్ట్రీని.. కన్నడ భాషను మర్చిపోలేనని తెలిపింది. అమిగోస్ చిత్రం విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో లైవ్ కి వచ్చింది ఆషికా.

తెలుగులోకి మారిన తర్వాత కన్నడను మరిచిపోవద్దు, కన్నడ సినిమాని వదలొద్దు అంటూ కన్నడిగులు కామెంట్స్ చేయగా.. నా మాతృభాష కన్నడ. నేను కన్నడ మాత్రమే మాట్లాడతాను. సొంత భాషను ఎలా మర్చిపోతారు?' ఆశికా రంగనాథ్ అన్నారు.

నేను పుట్టినప్పటి నుంచి కన్నడ మాట్లాడుతున్నాను. తర్వాత కన్నడ కూడా మాట్లాడతాను. పని విషయానికి వస్తే, మనం ఎక్కడ ఉన్న భాష నేర్చుకోవాలి. చాలా మంది మెచ్యూర్ మెసేజ్‌లు పంపుతున్నారు.

నాకు తెలుసు మన కన్నడిగులు నటులు, నటీమణుల విషయంలో కొంచెం ఎక్కువగానే విని ఉంటారు. మంచి సినిమాలు చేసి మీ అందరినీ గర్వపడేలా చేస్తాను. మీ ప్రేమ ఎప్పుడూ ఇలాగే ఉండాలి' అని ఆశికా రంగనాథ్ అన్నారు.




