AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: తన భర్త సినిమా నుంచి తప్పుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న నయన్ ?.

ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ కాంబోలో రాబోతున్న జవాన్ చిత్రంలో నటిస్తున్న నయన్.. తాజాగా ఓ సంచలనం నిర్ణయం తీసుకున్నట్లుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

Nayanthara: తన భర్త సినిమా నుంచి తప్పుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న నయన్ ?.
Nayan
Rajitha Chanti
|

Updated on: Feb 11, 2023 | 7:14 PM

Share

అతి తక్కువ సమయంలోనే దక్షిణాది ఇండస్ట్రీలో లేడి సూపర్ స్టార్‏గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నయనతార. హీరోలతోపాటు సరి సమానంగా రెమ్యూనరేషన్ తీసుకోవడమే కాకుండా.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న నయన్.. గతేడాది పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. వీరికి సరోగసి ద్వారా ఇద్దరు కవలలు జన్మించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ కాంబోలో రాబోతున్న జవాన్ చిత్రంలో నటిస్తున్న నయన్.. తాజాగా ఓ సంచలనం నిర్ణయం తీసుకున్నట్లుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. లేటేస్ట్ సమాచారం ప్రకారం నయన్ ఇకపై తమిళ్ స్టార్ హీరో అజిత్ సరసన నటించనని తేల్చీ చెప్పేసిందట. ఇందుకు కారణం తన భర్తకు జరిగిన అవమానమే అని టాక్ వినిపిస్తుంది.

వివరాల్లోకి వెళితే.. నయనతార భర్త డైరెక్టర్ విఘ్నేష్ శివన్.. గత కొన్నేళ్లుగా స్టార్ హీరో అజిత్ తో ఓ సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన తునీవు సినిమా తర్వాత విఘ్నేష్, అజిత్ కాంబో సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ ఈ సినిమాకు సంబంధించిన కథ నచ్చలేదంటూ అజిత్.. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారని.. ఆ కారణంగానే ఈ ప్రాజెక్ట్ నుంచి విఘ్నేష్ ను తప్పించాయని టాక్ నడుస్తోంది. అయితే భర్త కోసం రంగంలోకి దిగిన నయన్.. అజిత్.. లైకా ప్రొడక్షన్స్ తో సామరస్య పరిష్కారానికి ప్రయత్నిందట.

అయితే ఆమె తన భర్త కోసం చేసిన ప్రయత్నాలన్ని కుదరలేదని.. దీంతో ఇక పై ఆమె అజిత్ సరసన నటించబోనని తెల్చేసిందట. ఇప్పుడు ఇదే కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీలో అజిత్.. నయన్ సూపర్ హిట్ పెయిర్. ఈ జంటకు అభిమానులు అనేకం. వీరి కాంబోలో బిల్లా, విశ్వాసం, ఆరంభం వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు వచ్చాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.