Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: రాధేశ్యామ్‌ డైరెక్టర్‌కు మరో ఛాన్స్‌ ఇస్తున్న ప్రభాస్‌.. అయితే ఈసారి మాత్రం..

ప్రభాస్‌ హీరోగా రాధేశ్యామ్‌ దర్శకత్వంలో వచ్చిన రాధేశ్యామ్‌ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదనే విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్లు మాత్రం రాబట్టలేకపోయింది. అత్యధిక బడ్జెట్‌తో...

Prabhas: రాధేశ్యామ్‌ డైరెక్టర్‌కు మరో ఛాన్స్‌ ఇస్తున్న ప్రభాస్‌.. అయితే ఈసారి మాత్రం..
Prabhas
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 11, 2023 | 5:34 PM

ప్రభాస్‌ హీరోగా రాధేశ్యామ్‌ దర్శకత్వంలో వచ్చిన రాధేశ్యామ్‌ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదనే విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్లు మాత్రం రాబట్టలేకపోయింది. అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బుల్లి తెర, ఓటీటీలో మాత్రం ప్రేక్షకులను కొంతమేర ఆకట్టుకుంది. ముఖ్యంగా పాటలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత దర్శకుడు రాధాకృష్ణ ఇప్పటి వరకు కొత్త మూవీపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

సహజంగా అయితే ఒక ఫ్లాప్‌ ఇచ్చిన తర్వాత మరోసారి ఆ దర్శకుడికి అవకాశం ఇవ్వడం అంత సులభమైన విషయం కాదు. కానీ ప్రభాస్‌ మాత్రం రాధాకృష్ణపై ఉన్న నమ్మకంతో మరో ఛాన్స్‌ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఈసారి రాధా కృష్ణ డైరెక్ట్ చేయబోతున్న మూవీలో ప్రభాస్‌ హీరోగా నటించడం లేదు. గోపీచంద్‌తో తెరకెక్కించే సినిమాను ప్రభాస్‌ సొంత బ్యానర్‌ యూవీ క్రియేషన్స్‌లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

గతంలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో గోపిచంద్‌ హీరోగా జిల్‌ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారానే రాధాకృష్ణ దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించారు. రాధేశ్యామ్‌ వంటి ఫ్లాప్‌ తర్వాత కూడా ప్రభాస్‌ మరోసారి అవకాశం ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే గోపిచంద్‌ ప్రస్తుతం శ్రీవాస్‌ దర్శకత్వంలో రామబాణం అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల తర్వాత రాధాకృష్ణ మూవీలో జాయిన్‌ కానున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

వేసవిలో మెరిసే చర్మం కోసం నిమ్మ రసాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా
వేసవిలో మెరిసే చర్మం కోసం నిమ్మ రసాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా
వెండి నగలకు బంగారం ఇవ్వమన్న ఇద్దరు మహిళలు.. డౌట్ వచ్చి..
వెండి నగలకు బంగారం ఇవ్వమన్న ఇద్దరు మహిళలు.. డౌట్ వచ్చి..
మనిషికి పంది లివర్ అమర్చిన డాక్టర్లు! ఎక్కడంటే..?
మనిషికి పంది లివర్ అమర్చిన డాక్టర్లు! ఎక్కడంటే..?
తగ్గేదేలే.. ఏపీలో ఉప ఎన్నికల పంచాయితీ.. 9 ప్రాంతాల్లో హోరీ హోరీ..
తగ్గేదేలే.. ఏపీలో ఉప ఎన్నికల పంచాయితీ.. 9 ప్రాంతాల్లో హోరీ హోరీ..
క్యాబ్ ఖర్చుకే ఎయిర్ టాక్సీ.. జాలీ జాలీగా ఆకాశ ప్రయాణం..
క్యాబ్ ఖర్చుకే ఎయిర్ టాక్సీ.. జాలీ జాలీగా ఆకాశ ప్రయాణం..
అప్పట్లో ఇంటి అద్దె కట్టడానికి అమ్మానాన్న ఎన్నో ఇబ్బందులుపడ్డారు.
అప్పట్లో ఇంటి అద్దె కట్టడానికి అమ్మానాన్న ఎన్నో ఇబ్బందులుపడ్డారు.
గుడ్‌న్యూస్‌.. కానిస్టేబుల్‌ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం..!
గుడ్‌న్యూస్‌.. కానిస్టేబుల్‌ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం..!
ఇండియా-ఏ తరఫున ఆడనున్న కోహ్లీ, రోహిత్‌ శర్మ!
ఇండియా-ఏ తరఫున ఆడనున్న కోహ్లీ, రోహిత్‌ శర్మ!
అమ్మవారికి నైవేద్యంగా చిరుతిళ్ళు.. ఈ శక్తి పీఠం ఎక్కడ ఉందంటే
అమ్మవారికి నైవేద్యంగా చిరుతిళ్ళు.. ఈ శక్తి పీఠం ఎక్కడ ఉందంటే
రామ్ చరణ్‌కు వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్
రామ్ చరణ్‌కు వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్