AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandamuri: నందమూరి ఫ్యామిలీలో మరో ప్రమాదం.. బాలకృష్ణ సోదరుడి కారు నుజ్జు నుజ్జు

నందమూరి కుటుంబంలో మరో వ్యక్తి రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. ఎన్టీఆర్‌ కుమారుడు, బాలకృష్ణ సోదరుడు రామకృష్ణ ప్రయాణిస్తున్న కారు శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్-10 లో ఈ యాక్సిడెంట్‌ జరిగింది.

Nandamuri: నందమూరి ఫ్యామిలీలో మరో ప్రమాదం.. బాలకృష్ణ సోదరుడి కారు నుజ్జు నుజ్జు
Nandamuri Ramakrishna
Basha Shek
|

Updated on: Feb 11, 2023 | 11:11 AM

Share

నందమూరి కుటుంబంలో మరో వ్యక్తి రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. ఎన్టీఆర్‌ కుమారుడు, బాలకృష్ణ సోదరుడు రామకృష్ణ ప్రయాణిస్తున్న కారు శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్-10 లో ఈ యాక్సిడెంట్‌ జరిగింది. ఈ ప్రమాదంలో రామకృష్ణకు స్వల్పగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. ప్రమాదం ఆయన కుటుంబ సభ్యులు వచ్చి కారుని తీసుకెళ్లారు. అయితే ఈ ప్రమాదంపై ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు పేర్కొన్నారు. కాగా నందమూరి కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటుండడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నందమూరి తారకరత్న గుండె పోటుకు గురైన సంగతి తెలిసందే. నారా లోకేశ్‌ పాదయాత్రలో కుప్పకూలిన ఆయన ప్రస్తుతం బెంగళూరు హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందతున్నాడు. ప్రస్తుతం తారకరత్న క్రమంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.

కాగా నందమూరి కుటుంబ సభ్యులు వరుసగా రోడ్డు ప్రమాదాల బారిన పడడం ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో నందమూరి హరికృష్ణ, నందమూరి జానకీరామ్‌లు కారు యాక్సిడెంట్స్‌లోనే కన్నుమూశారు. ఇక జూనియర్‌ ఎన్టీఆర్ సైతం ఒకసారి రోడ్డుప్రమాదానికి గురయ్యారు. ఇక తాజాగా గాయపడ్డ నందమూరి హరికృష్ణ కూడా గతంలో ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. పెద్దన్నయ్య విజయోత్సవ సభకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇక ఆయన ఇటీవల బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తారకరత్నను పరామర్శించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తారకరత్న ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని తెలిపారు. ఇంతలోనే ఆయన రోడ్డు ప్రమాదానికి గురవ్వడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్