IND vs AUS: భారీ సిక్సర్లతో చెలరేగిన షమీ.. ఆసీస్ టాప్ స్పిన్నర్‌కు చుక్కలు.. దెబ్బకు కోహ్లీ రికార్డు కూడా బద్దలు
ఈ మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ ఆటగాడు మహ్మద్ షమీ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షమీ.. కేవలం 47 బంతుల్లోనే 37 రన్స్ సాధించాడు.
నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా దూకుడు కొనసాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 321/7 పరుగులతో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 400 పరుగులకు ఆలౌటైంది. తద్వారా మొదటి ఇన్నింగ్స్‌లో 223 పరుగుల ఆధిక్యం సంపాదించింది. రోహిత్ శర్మ(120) సెంచరీతో టాప్ స్కోరర్‌తో నిలవగా, జడేజా 70, అక్షర్ పటేల్ 84 పరుగులతో రాణించారు. ఆసీస్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ 124 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ ఆటగాడు మహ్మద్ షమీ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షమీ.. కేవలం 47 బంతుల్లోనే 37 రన్స్ సాధించాడు. అతనిఇన్నింగ్స్‌లో 3 సిక్స్‌లు, రెండు ఫోర్లు ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. షమీ కొట్టిన మూడు సిక్స్ లు.. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన టాడ్ మర్ఫీకే బౌలింగ్‌లోనే. అంతేకాదు అక్షర్ పటేల్‌తో కలిసి షమీ కీలకమైన 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
కాగా ఈ మ్యాచ్ ద్వారా కొన్ని రికార్డులు కొల్లగొట్టాడు మహ్మద్ షమీ. భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన వ్యక్తిగా విరాట్ కోహ్లీ కంటే ముందు షమీ ఉండడం గమనార్హం. విరాట్ కోహ్లి ఇప్పటి వరకు 104 టెస్టు మ్యాచ్‌లు ఆడి, 24 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. అదే సమయంలో షమీ ఇప్పటి వరకు 61 టెస్టు మ్యాచ్‌లు ఆడి, 25 సిక్సర్లు బాదాడు. నాగ్‌పూర్ టెస్టుకు ముందు షమీ కెరీర్‌లో 22 సిక్సర్లు ఉండగా.. ఈ మ్యాచ్లో ఏకంగా 3 సిక్సర్లు కొట్టేశాడు. తద్వారా కోహ్లీ రికార్డును కొల్లగొట్టాడు. కాగా టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరు మీద ఉంది. అతని కెరీర్ లో మొత్తం 91 సిక్సర్లు ఉన్నాయి. ఇక ప్రస్తుత ఆటగాళ్లలో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. కాగా షమీ సంచలన ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Great shot by @MdShami11 ??#RohitSharma? #ViratKohli? #MohammedShami #Jadeja #INDvsAUSTest #BGT2023 pic.twitter.com/gg71Agzp05
— Rajat Singh (@SinghRajat00) February 11, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..