IND vs AUS 1st Test: తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌట్.. చివర్లో విజృంభించిన అక్సర్.. ఆసీస్‌పై భారీ ఆధిక్యం.. వివరాలివే..

IND vs AUS 1st Test: భారత్, అస్ట్రేలియా జట్ల మధ్య నాగ్‌పూర్‌లో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌటయింది..

IND vs AUS 1st Test: తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌట్.. చివర్లో విజృంభించిన అక్సర్.. ఆసీస్‌పై భారీ ఆధిక్యం.. వివరాలివే..
Ind Vs Aus 1st Test
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 11, 2023 | 12:20 PM

IND vs AUS 1st Test: భారత్, అస్ట్రేలియా జట్ల మధ్య నాగ్‌పూర్‌లో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌటయింది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లోని విదర్భ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో.. తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్ జట్టు 177 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక టీమిండియా తరఫున ఓపెనర్‌గా దిగిన రోహిత్ శర్మ(212 బంతుల్లో 120; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో సెంచరీ చేయగా.. మధ్యలో వచ్చిన రవీంద్ర జడేజా(185 బంతుల్లో 70; 9 ఫోర్లు), తొమ్మిదో స్థానంలో వచ్చిన ఆక్సర్ పటేల్ (174 బంతుల్లో 84; 10 ఫోర్లు; 1 సిక్స్) ఆసీస్ బౌలర్లకు టెస్ట్ మ్యాచ్‌లో కూడా చెమటలు పట్టింటారు.

అలాగే వీరితో పాటు చివర్లో వచ్చిన మొహమ్మద్ షమి (47 బంతుల్లో 37; 2 ఫోర్లు; 3 సిక్సర్లు) కూడా పర్వాలేదనిపించాడు. ఈ నలగురు మినహా మిగిలినవారంతా పేలవ ప్రదర్శనను కనబర్చారు. అయితే ఆసీస్ బౌలర్లలో ఆరంగేట్ర ఆటగాడు 7 వికెట్లతో చెలరేగాడు. తనతో పాటు ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ 2 వికెట్లు, నాథన్ లియన్ 1 వికెట్ తీసుకున్నారు. అంతకముందు ఆసీస్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో  177 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆస్ట్రేలియాపై భారత్ 223 పరుగుల లీడ్‌ను సాధించినట్లయింది.

ఇవి కూడా చదవండి

కాగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు తరఫున మార్నస్ లబుషేన్(49), స్టీవ్ స్మిత్(37), పీటర్ హ్యాండ్స్కాంబ్(31) అలెక్స్ కారీ(36) మినహా మిగిలిన వారెవరూ రెండంకెల స్కోర్‌ను అందుకోలేకపోయారు. ఇక ఆ ఇన్నింగ్స్‌లో భారత్ బౌలర్లతో స్పిన్నర్లు ఆధిక్యతను ప్రదర్శించారు. చాలా కాలం తర్వాత టీమ్‌లోకి వచ్చిన రవీంద్ర జడేజా 5 వికెట్లతో విజృంభించగా.. రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీశాడు. అలాగే మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పాకిస్తానీ మూలాలున్న బ్రిటిషర్లు రెచ్చిపోతున్నారుః మస్క్
పాకిస్తానీ మూలాలున్న బ్రిటిషర్లు రెచ్చిపోతున్నారుః మస్క్
కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్
కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్
డేంజర్ బెల్స్.. చైనాలో మరో మహమ్మారి.. భారత్ అలర్ట్
డేంజర్ బెల్స్.. చైనాలో మరో మహమ్మారి.. భారత్ అలర్ట్
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్