Viral Video: లైవ్‌ మ్యాచ్‌లో ఆగిపోయిన ఫ్లడ్ లైట్స్.. స్టేడియం మొత్తం చీకటి మయం.. వైరల్‌ వీడియో

ఐపీఎల్ తో పోటీ పడి టోర్నీ నిర్వహిస్తామని చెబుతోన్న ఆయా క్రికెట్‌ బోర్డులు నిర్వహణలో మాత్రం చేతులెత్తేస్తున్నాయి. తాజాగా బంగ్లా వేదికగా జరుగుతోన్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఒక ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది.

Viral Video: లైవ్‌ మ్యాచ్‌లో ఆగిపోయిన ఫ్లడ్ లైట్స్.. స్టేడియం మొత్తం చీకటి మయం.. వైరల్‌ వీడియో
Dhaka Cricket Stadium
Follow us
Basha Shek

|

Updated on: Feb 11, 2023 | 9:58 AM

ఐపీఎల్‌కు పోటీగా వివిధ దేశాలు కూడా క్రికెట్‌ లీగ్‌లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సౌతాఫ్రికాలో SA 20టీ లీగ్‌, పాకిస్తాన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (PPL), బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (BPL) తదితర క్రికెట్‌ లీగ్‌లు జరుగుతున్నాయి. ఐపీఎల్ తో పోటీ పడి టోర్నీ నిర్వహిస్తామని చెబుతోన్న ఆయా క్రికెట్‌ బోర్డులు నిర్వహణలో మాత్రం చేతులెత్తేస్తున్నాయి. తాజాగా బంగ్లా వేదికగా జరుగుతోన్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌ (బీపీఎల్) లో ఒక ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. లైవ్‌ మ్యాచ్ జరుగుతుండగా ఒక్కసారిగా మైదానంలోని ఫ్లడ్ లైట్లు ఆగిపోయాయి. దీంతో స్టేడియం మొత్తం గాఢాందకారంగా మారింది. అయితే మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు సెల్ ఫోన్లతో మైదానంలో వెలుగులు నింపారు. ఈ కారణంగా కాసేపు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. శుక్రవారం రాత్రి ఫార్చ్యూన్ బరిషల్, ఖుల్నా టైగర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

ఫార్చ్యూన్ బరిషల్, ఖుల్నా టైగర్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్.. లీగ్ మ్యాచుల్లో ఆఖరిది కావడంతో అభిమానులు భారీగా హాజరయ్యారు. అందుకు తగ్గట్టుగానే మ్యాచ్ కూడా రసవత్తరంగా ప్రారంభమైంది. అయితే ఆ ఆనందం అభిమానులకు ఎక్కువ సేపు నిలవలేదు. మ్యాచ్ ప్రారంభమైన రెండో ఓవర్ లోనే గ్రౌండ్‌లోని ఫ్లడ్ లైట్స్ ఆగిపోయాయి. బంగ్లాదేశ్ లో విద్యుత్ వినియోగంపై ఆంక్షలు ఉండడం, స్టేడియంకు ఆటోమేటిక్ పవర్ సిస్టం అందుబాటులో లేకపోవడంతో ఫ్లడ్ లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా అంధకారంలో మునిగిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారిపోయాయి. ఐపీఎల్‌తో పోటీపడి క్రికెట్ టోర్నీ నిర్వహిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు కనీసం పవర్‌ సప్లై అందించలేకపోతుందా? అని క్రికెట్‌ ఫ్యాన్స్‌ అని ట్రోల్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

BBLలో RCB కొత్త ప్లేయర్ అరాచకం !
BBLలో RCB కొత్త ప్లేయర్ అరాచకం !
ఒకే రోజు 2 రెండు హాఫ్ సెంచరీలు.. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్
ఒకే రోజు 2 రెండు హాఫ్ సెంచరీలు.. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్
నకిలీ ఖాతాతో అశ్విన్ పొరపాటు: రోహిత్ భార్యతో సంభాషణ వైరల్!
నకిలీ ఖాతాతో అశ్విన్ పొరపాటు: రోహిత్ భార్యతో సంభాషణ వైరల్!
గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా: కేటీఆర్
గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా: కేటీఆర్
బాబర్ ఆజమ్ Vs ముల్డర్: కేప్ టౌన్ టెస్టులో రికార్డులు, వివాదాలు!
బాబర్ ఆజమ్ Vs ముల్డర్: కేప్ టౌన్ టెస్టులో రికార్డులు, వివాదాలు!
తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు! దిల్ రాజు కీలక ప్రకటన
తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు! దిల్ రాజు కీలక ప్రకటన
పంట పొలంలో ప్రత్యక్షమైన జింకపిల్ల..కుక్కల దాడి నుంచి కాపాడిన
పంట పొలంలో ప్రత్యక్షమైన జింకపిల్ల..కుక్కల దాడి నుంచి కాపాడిన
40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో