Rishabh Pant: గుడ్‌న్యూస్‌.. యాక్సిడెంట్‌ తర్వాత ఫస్ట్‌ టైమ్‌ తన ఫొటోలు షేర్‌ చేసిన పంత్.. ఒక్కో అడుగేస్తూ..

టీమిండియా అభిమానులకు స్టార్‌ వికెట్‌ కీపర్‌ అండ్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. గతేడాది చివర్లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతను వేగంగా కోలుకుంటున్నాడు. కాగా ఎప్పటికప్పుడు తన హెల్త్‌ అప్‌డేట్స్‌ ను సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నాడు పంత్‌.

Rishabh Pant: గుడ్‌న్యూస్‌.. యాక్సిడెంట్‌ తర్వాత ఫస్ట్‌ టైమ్‌ తన ఫొటోలు షేర్‌ చేసిన పంత్.. ఒక్కో అడుగేస్తూ..
Rishabh Pant
Follow us
Basha Shek

|

Updated on: Feb 11, 2023 | 9:22 AM

టీమిండియా అభిమానులకు స్టార్‌ వికెట్‌ కీపర్‌ అండ్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. గతేడాది చివర్లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతను వేగంగా కోలుకుంటున్నాడు. కాగా ఎప్పటికప్పుడు తన హెల్త్‌ అప్‌డేట్స్‌ ను సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నాడు పంత్‌. ఈక్రమంలో తాను వేగంగా కోలుకుంటున్నట్లు చెబుతూ సోషల్ మీడియాలో తన ఫొటోలు రిలీజ్ చేశాడీ స్టార్‌ క్రికెటర్‌. రోడ్‌ యాక్సిడెంట్‌ తర్వాత పంత్ కనిపించిన ఫస్ట్ ఫొటో ఇదే కావడం గమనార్హం. ఈ ఫొటోల్లో వాకింగ్ స్టిక్స్ ప‌ట్టుకొని న‌డుస్తూ కనిపించాడు పంత్. అత‌ని కుడి కాలికి బ్యాండేజ్ కూడా క‌నిపిస్తోంది. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన పంత్.. ‘ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు బలంగా.. ఒక అడుగు మెరుగ్గా’ అని క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ‘కమాన్‌ ఛాంపియన్‌.. గెట్‌ వెల్‌ సూన్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా గతేడాది డిసెంబర్ 30న హరిద్వార్-ఢిల్లీ హైవే మీద పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. డివైడర్‌ను ఢీకొట్టిన కారుకు మంటలు అంటుకోగా రిషబ్ గాయాలతో బయటపడ్డాడు. అయితే అతని ముఖం, వీపు భాగంలో బాగా గాయాలయ్యాయి. దీంతో పంత్‌ను డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బీసీసీఐ అతణ్ని ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌కు తరలించింది. అక్కడే పంత్‌కు మోకాలి లిగ్మెంట్ శస్త్రచికిత్స చేశారు. కాగా గాయాల కారణంగా పంత్ బోర్డర్ గావస్కర్ ట్రోఫీతోపాటు ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న వరల్డ్ కప్‌లోనూ పంత్ ఆడటం అనుమానంగానే మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..