India vs Australia: కుక్కతోక వంకర.. మరోసారి వక్రబుద్ధి ప్రదర్శించిన ఆస్ట్రేలియా మీడియా..
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు, వారి మీడియా కలిస్తే ఎంత రోత పుట్టిస్తారో మరోసారి నిరూపించారు. లేని వివాదాన్ని సృష్టించి ఆనందం పొందడం హాబీగా మారింది. భారత్ - ఆసీస్ తొలి టెస్టు సందర్భంగా ఇలాంటి వివాదాన్నే రాజేశారు.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు, వారి మీడియా కలిస్తే ఎంత రోత పుట్టిస్తారో మరోసారి నిరూపించారు. లేని వివాదాన్ని సృష్టించి ఆనందం పొందడం హాబీగా మారింది. భారత్ – ఆసీస్ తొలి టెస్టు సందర్భంగా ఇలాంటి వివాదాన్నే రాజేశారు.
కుక్కతోక వంకరే అనే సామెత అందరికీ తెలుసు. ఆస్ట్రేలియన్లు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతారు. ఇప్పుడెందుకంటే.. భారత్‌తో టెస్ట్ సిరీస్ మొదలు కాకముందే ఆసీస్ మాజీలు మైండ్ గేమ్ మొదలు పెట్టేశారు. పిచ్ నుంచి.. బాల్ ట్యాంపరింగ్ వరకు రోజుకో వివాదాన్ని సృష్టిస్తున్నారు ఆసీస్ మాజీలు, మీడియా. భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై బాల్ టాంపరింగ్ ఆరోపణల్ని ఆస్ట్రేలియా గుప్పిస్తోంది. నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్టు తొలి రోజే ఆస్ట్రేలియా టీమ్ 177 పరుగులకి ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 47 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఐదు నెలలు ఆటకి దూరంగా ఉన్న జడేజా రీఎంట్రీ అదిరిపోయిందని టీమిండియా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. కాని ఆస్ట్రేలియా మాత్రం ఇంకో విషయాన్ని బయటకు తీసింది.
మ్యాచ్ రెండో సెషన్‌లో మహ్మద్ సిరాజ్ నుంచి ఓ క్రీమ్‌ని అందుకున్న రవీంద్ర జడేజా.. తన ఎడమచేతి చూపుడు వేలికి రాసుకుంటూ కనిపించాడు. ఎడమ చేతి వాటం స్పిన్నరైన జడేజా బంతిని తిప్పాలంటే ఆ వేలు చాలా కీలకం. దాంతో జడేజా ఆ క్రీమ్‌తో బాల్ టాంపరింగ్‌కి పాల్పడ్డాడంటూ ఆస్ట్రేలియా ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ మేరకు ఓ వీడియోను కూడా వైరల్ చేసింది.
మహ్మద్ సిరాజ్ నుంచి జడేజా తీసుకున్నది పెయిన్ రిలీఫ్ క్రీమ్ అని నాగ్‌పూర్ టెస్టు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌కి టీమిండియా మేనేజ్‌మెంట్ వివరణ ఇచ్చింది. ఆస్ట్రేలియా టీమ్ కూడా విషయంపై మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయలేదు. వాస్తవానికి జడేజా క్రీమ్‌ని చేతి వేలికి రాసుకునే సమయానికి ఆస్ట్రేలియా టీమ్ 120/5తో నిలవగా.. అప్పటికే మూడు వికెట్లు కూడా జడేజా పడగొట్టేశాడు. ఆ తర్వాత అతను తీసింది రెండు వికెట్లే.
అంతకముందు కూడా పిచ్‌పై ఇలాంటి కాంట్రవర్సీనే రాజేసింది ఆస్ట్రేలియా మీడియా. తర్వాతరోజు ఖవాజా ఎల్బీడబ్ల్యూ ఔట్‌పైనా ఇదేవిధంగా ప్రవర్తించింది వారి మీడియా. డీఆర్‌ఎస్ బ్రేక్ అయిందా అంటూ వివాదాన్ని రాజేశారు. సిరీస్ మొదలైన రెండు రోజులకే ఇలాంటి వివాదాలు రాజేస్తే.. ఇక ముగిసే వరకు ఎలాంటి విచిత్రాలు చూడాలో అనుకుంటున్నారు ఫ్యాన్స్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..