AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smriti Mandhana: వేలంలో లేడీ ‘విరాట్‌’ను దక్కించుకున్న బెంగళూరు.. స్మృతి కోసం ఎన్ని కోట్లు వెచ్చించారంటే?

వేలం మొదట టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ స్మృతి మంధానతో ప్రారంభమైంది. గత కొన్నేళ్లుగా అన్ని ఫార్మాట్లలో పరుగుల వర్షం కురిపిస్తోన్న ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాట్‌ను దక్కించుకోవడానికి అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి.

Smriti Mandhana: వేలంలో లేడీ 'విరాట్‌'ను దక్కించుకున్న బెంగళూరు.. స్మృతి కోసం ఎన్ని కోట్లు వెచ్చించారంటే?
Smriti Madhana
Basha Shek
|

Updated on: Feb 13, 2023 | 4:38 PM

Share

క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (WPL) వేలం మొదలైంది. ముంబై వేదికగా జరుగుతున్న ఈ యాక్షన్‌లో మొత్తం 409 మంది ఆటగాళ్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఈ వేలం మొదట టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ స్మృతి మంధానతో ప్రారంభమైంది. గత కొన్నేళ్లుగా అన్ని ఫార్మాట్లలో పరుగుల వర్షం కురిపిస్తోన్న ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాట్‌ను దక్కించుకోవడానికి అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుస్మృతిని దక్కించుకుంది. ఇందుకోసం ఏకంగా రూ.3.40 కోట్లను వెచ్చించింది. ఈ వేలంలో స్మృతి బేస్ ప్రైస్ కనీసం రూ. 50 లక్షలు కాగా ముంబై ఏకంగా రెండు కోట్లకు బిడ్ చేసింది.  ఇతర ఫ్రాంఛైజీలు కూడా భారీ ధరను బిడ్ చేశాయి. అయితే మహిళల క్రికెట్లో లేడీ విరాట్ గా పేరున్న స్మృతిని దక్కించుకోవడానికి బెంగళూరు ఏకంగా రూ.3.40 కోట్లు వెచ్చించింది. కాగా ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 బ్యాటర్లలో స్మృతి మంధాన ఒకరు.

ఈ లెఫ్ట్‌ హ్యాండ్ బ్యాటర్‌కు ఏకంగా 112 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఇప్పటివరకు 27.32 సగటుతో మొత్తం 2651 పరుగులు చేసిందామె . ఇందులో 20 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ టీ20లో మంధాన స్ట్రైక్ రేట్ 123 కంటే ఎక్కువ. స్మృతి మంధాన కూడా మహిళల బిగ్ బాష్ లీగ్‌లో ఆడుతోంది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ లీగ్‌లో స్మృతి 38 మ్యాచ్‌లు ఆడి 784 పరుగులు చేసింది. ఈ టోర్నీలో మంధాన స్ట్రైక్ రేట్ 130 కంటే ఎక్కువ. ఇక ది హండ్రెడ్‌ టోర్నీలో 8 మ్యాచ్‌ల్లో 211 పరుగులు చేసింది. ఈ సమయంలో ఆమె స్ట్రైక్ రేట్ 151 కంటే ఎక్కువ.

ఇవి కూడా చదవండి

ఫార్మాట్ ఏదైనా పరుగుల వర్షమే..

కాగా టీ20లోనూ సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడగల సత్తా స్మృతి మంధానకు ఉంది. కెప్టెన్సీకి స్మృతి మంధాన బెస్ట్ ఆప్షన్. పైగా బోలెడు అనుభవం ఉంది.  ప్రస్తుతం టీమిండియాకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తోన్న స్మృతికి ఆర్సీబీకి కెప్టెన్  బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..