Babar Azam: 6,6,6,6,6,6.. వరుస సిక్సర్లతో బౌలర్లకు చుక్కలు చూపిన పాకిస్థాన్ కెప్టెన్.. అసలు విషయం తెలిస్తే షాక్ కావలసిందే..
ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదడం అంటే మాములు విషయం కాదు. ఇక ఆ విషయంలో మనందరికీ గుర్తుండేది టీ20 వరల్డ్ కప్ 2007 లో ఇంగ్లాండ్ జట్టుపై యువరాజ్ ఇన్నింగ్స్
ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదడం అంటే మాములు విషయం కాదు. ఆ ఘనతను ఇప్పటివరకూ చాలా కొద్ది మందే అందుకున్నారు. అందులో మనందరికీ గుర్తుండేది టీ20 వరల్డ్ కప్ 2007 లో ఇంగ్లాండ్ జట్టుపై యువరాజ్ ఇన్నింగ్స్ మాత్రమే. ఇంగ్లాండ్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్‌లో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టి ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. అదే తరహాలో పాకిస్టానీ క్రికెటర్ బాబర్ అజమ్ కూడా వరుసగా ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టి చూపించాడు. అయితే అతను ఇలా చేసింది ఇంటర్నేషనల్ క్రికెట్‌లో లేదా దేశీ క్రికెట్‌లో కానే కాదు. మ్యాచ్‌కు ముందు చేసే ప్రాక్టీస్ సెషన్‌లో ఇలా 6 బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. ఇక దీనికి సంబంధించిన ట్వీట్‌ను చూసిన నెటిజన్లు.. ప్రాక్టీస్ సెషన్‌లో కొట్టిన ఆరు సిక్సులకు ఇంత అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే మరోవైపు నేటి నుంచి పీఎస్‌ఎల్ అంటే.. పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రారంభం కానుండడంతో మొదటి మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తన్స్, లాహోర్ కాలెండర్స్ జట్లు తలపడనున్నాయి. ఇదే క్రమంలో బాబర్ అజామ్ నాయకత్వం వహిస్తున్న పెషవార్ జల్మీ జట్టు కరాచీ కింగ్స్‌తో బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలోనే ప్రాక్టీస్ చేసిన బాబర్ ఒకే ఒవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టాడు. అతని బ్యాటింగ్ స్టైల్‌ను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే బాబర్ వంటి ప్లేయర్ నుంచి వరుసగా ఆరు బౌండరీలను ఆశించవచ్చు కానీ ఆరు బంతులకు ఆరు సిక్సులంటే నమ్మశక్యం కాని విషయమే అని చెప్పుకోవాలి. ఇక బాబర్ ఆరు సిక్సుల సెషన్‌కు సంబంధించిన వీడియోను ఫరీద్ ఖాన్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేయడంతో అది ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనిపై విభిన్న స్పందనలు వస్తున్నా.. ‘ఆ బాదుడు ఆట ప్రాక్టీస్‌కి మాత్రమే పరిమిత’మని ఎక్కువ మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Babar Azam hits SIX SIXES IN SIX BALLS in Peshawar Zalmi training session. Proper power-hitting by him
Watch all his amazing SIXES here https://t.co/7PPaaRUUmK pic.twitter.com/KJCTJRattC
— Farid Khan (@_FaridKhan) February 13, 2023
బాబర్ ఈసారి రికార్డులు సృష్టిస్తాడా..?
పీఎస్‌ఎల్ 2021, 2022 సీజన్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో బాబర్ ఆజం కూడా ఒకడిగా ఉన్నాడు. అతను PSL 2021లో 554 పరుగులు సాధించగా, PSL 2022లో బాబర్ 473 పరుగులు చేశాడు. మరి ఇప్పుడు అతను పెషావర్ జల్మీ ప్రాక్టీస్ సెషన్‌లో చూపిన విధ్వంసకరమైన ఆటతీరు.. PSL 2023లో.. బాబర్ ఆజం అతని మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Babar Azam hits a total of NINE SIXES in Peshawar Zalmi training session. New role for him in the team it seems! ? #HBLPSL8
Watch more of these big sixes from Babar here ?https://t.co/7PPaaRUUmK pic.twitter.com/NXADD2ZKPj
— Farid Khan (@_FaridKhan) February 13, 2023