Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spring Onions Benefits: ఉల్లి కాడలతో ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోవాలసిందే..

ఉల్లిపాయలో ఎన్ని ఉపయోగకరమైన పోషకాలు ఉంటాయంటే.. చెప్పడం కూడా కష్టమే. అందుకే మన పెద్దలు ఒక్క మాటలో ‘ఉల్లి చేసిన మేలు

Spring Onions Benefits: ఉల్లి కాడలతో ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోవాలసిందే..
Spring Onions Benefits
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 12, 2023 | 11:37 AM

ఎన్నో వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న ఉల్లిపాయ.. కూరల రుచులను రెట్టింపు చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందుకే భారతీయ వంటశాలలో ఉల్లిపాయకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఉల్లిపాయ రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఎంతగానో ఉపకరిస్తుంది. దీనితో ఎన్ని ఉపయోగకరమైన పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటే.. చెప్పడం కూడా కష్టమే. అందుకే మన పెద్దలు ఒక్క మాటలో ‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయద’న్నారు. అయితే ఈ ప్రయోజనాలు ఉల్లిపాయలతోనే కాదు.. దాని మొలకలతో కూడా కలుగుతాయి. ఉల్లిపాయ మొలకలను ఉల్లికాడలు అని అంటారు. వీటికే స్ప్రింగ్ ఓనియ‌న్స్ అని కూడా పేరు. ఉల్లిపాయల్ని వాడలేని వారికి తక్కువ ఘాటుతో, మంచి రుచితో ఉండే ఉల్లికాడలు సరైన ప్రత్యామ్నాయం. ఈ స్ప్రింగ్ ఓనియన్స్‌ను కూరలు, సలాడ్స్, సూప్స్‌, బిర్యానీ వంటి పలు ఆహారాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.  కొన్ని ప్రాంతాల్లో కొత్తిమీర‌, క‌రివేపాకులా వీటిని కూడా కూర‌ల్లో వేసుకుంటారు. ఖరీదు తక్కువగా ఉండే ఉల్లికాడల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఆ ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. ఉల్లికాడల్లో పీచు పదార్ధం ఎక్కువ. తరచుగా తినేవారిలో బరువు సమస్య ఏర్పడదు. ఇంకా మలబద్ధక సమస్య కూడా ఉండదు. ఉల్లి కాడల్లో ఉన్న డైటరీ ఫైబర్ ఆకలిని అదుపులో ఉంచుతుంది.
  2. ఫైల్స్ సమస్యతో ఇబ్బందిపడేవారు ఒక చిన్న బౌల్‌లో కొద్దిగా పెరుగు వేసుకుని అందులో ఉల్లికాడ ముక్కలను కలిపి.. రోజుకి రెండుసార్లు తింటే పైల్స్ స‌మ‌స్య త‌గ్గుతుంది. పైల్స్ వ‌ల్ల వ‌చ్చే వాపులు, నొప్పి కూడా త‌గ్గుతాయి.
  3. ఉల్లికాడ‌ల్లోనే స‌ల్ఫర్ అధికం. దీంతో తరచుగా తినే ఆహారంలో చేర్చుకుంటే కొలెస్ట్రాల్‌ను, హైబీపీని అదుపులో ఉంటాయి.
  4. జ‌లుబు, ద‌గ్గుతో ఇబ్బంది పడేవారికి ఉల్లికాడ‌ల‌ సూప్‌ దివ్య ఔషధం. ఉల్లికాడల సూప్ తాగితే దగ్గు జలుబు నుంచి వెంటనే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
  5. ఉల్లికాడ‌ల్లో  ఉండే పెక్టిన్ అనే ప‌దార్థం పెద్ద పేగుల్లోని సున్నిత‌మైన పొర‌ల‌ను ర‌క్షిస్తుంది. దీంతో పెద్ద పేగు దెబ్బ తిన‌కుండా, క్యాన్సర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా నివారిస్తుంది.
  6. ఉల్లికాడల్లో ఉన్న గ్జియాంతిన్ అనే పదార్థం కంటిచూపుని మెరుగుపరుస్తుంది.
  7. ఉల్లికాడలను ఎక్కువగా వాడితే రక్తపోటూ, ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.
  8. స్ప్రింగ్ ఓనియన్స్ లో ఉన్న ఫోలేట్లు గుండె జబ్బులని అదుపులో ఉంచుతాయి.
  9. ఉల్లికాడలు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. కాలేయం చుట్టూ పేరుకొనే అధిక కొవ్వు తగ్గేలా చూస్తాయి. వాటిల్లో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ ‘సి’, బీటా కెరొటిన్ కూడా ఎక్కువ మొత్తంలోనే లభిస్తాయి.
  10. ఉల్లికాడ‌ల్లో పోష‌కాలు అధికం.  స్త్రీ గర్భందాల్చిన మొదటి మూడు నెలల్లో తరచుగా ఉల్లికాడలను తింటే.. కడుపులో బిడ్డకు ఫోలిక్ యాసిడ్ అందుతుంది. గర్భస్థ శిశువుకి వెన్నెముక సమస్యలను నివారిస్తుంది. ఆటిజం వంటి ప్రవర్తనాపరమైన సమస్యలు దరిచేరవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
  11. ఉల్లికాడ‌ల‌ను ర‌సం ఒక టీ స్పూన్, ఒక టీ స్పూన్ తేనే కలిపి రోజూ తీసుకుంటే శరీర రోగనిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి