Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Benefits: ప్రతిరోజూ ఒక ఉల్లిపాయను తింటే ఇన్ని ప్రయోజనాలో.. తెలిస్తే అసలు వదిలిపెట్టరు..

‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయద’ని పెద్దల మాట. బహుశా దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల కారణంగానే అలా చెప్పి ఉంటారు. ఎన్నో రకాల కూరలలో..

Onion Benefits: ప్రతిరోజూ ఒక ఉల్లిపాయను తింటే ఇన్ని ప్రయోజనాలో.. తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
onions for diabetes and many health problems
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 12, 2023 | 7:12 AM

‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయద’ని పెద్దల మాట. బహుశా దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల కారణంగానే అలా చెప్పి ఉంటారు. ఎన్నో రకాల కూరలలో ఉపయోగించే ఉల్లిపాయ మన ఆహారం రుచిని మెరుగుపరచడంలో ఎంతగానో దోహదపడుతుంది. ఉల్లిపాయను ప్రతి ఇంటి కూరల తయారీలో, పప్పు, సలాడ్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉల్లిపాయల్లో యాంటీ అలర్జీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు విటమిన్ ఎ, బి6, సి విటమిన్లు సమృద్దిగా ఉంటాయి. ఉల్లిని తీసుకోవడం వల్ల శరీరాన్ని ఇన్ఫెక్షన్ బారిన నుంచి కాపాడుకోవచ్చు. మధుమేహం సమస్య ఉన్నవారికి అది నియంత్రణలోకి వచ్చి.. ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఆ కారణంగానే ప్రతిరోజూ ఒక పచ్చి ఉల్లిపాయను తినడం మంచిదని నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. మరి ఉల్లిపాయను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మధుమేహం: మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉల్లిపాయ చాలా మంచిది. రోజూ ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి ఇంకా కంట్రోల్‌లో ఉంటాయి. అందువల్ల డయాబెటిక్ పేషెంట్లు పచ్చి ఉల్లిపాయలను తప్పనిసరిగా తీసుకోవాలి.

కాలిన గాయాలు: కాలిన గాయాలను నయం చేయడానికి ఉల్లిపాయ రసం సహాయపడుతుంది. కాలిన ప్రదేశంలో ఉల్లి రసాన్ని రాసుకుంటే కాలిన గాయాలకు చల్లదనాన్ని అందించి  బొబ్బలను నిరోధిస్తుంది. కాలిన గాయాలకు ఇన్ఫెక్షన్లు రాకుండా కూడా ఉల్లిరసం అడ్డుకుంటుంది.

ఇవి కూడా చదవండి

వాపు: శరీరం వాపును తగ్గించడంలో ఉల్లిపాయ సహాయపడుతుంది. ఇందులో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని మంటను తగ్గించడంలో సహాయపడతాయి. వాపు సమస్యతో బాధపడుతుంటే పచ్చి ఉల్లిపాయలను తినవచ్చు.

ఎముకలు దృఢత్వం: ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఎందుకంటే ఎముకలని ధృడపరిచే అంశాలు ఉల్లిపాయలో ఉంటాయి. ఎముకలు బలహీనంగా ఉంటే పచ్చి ఉల్లిపాయలను తినవచ్చు.

జీర్ణక్రియ: మీకు జీర్ణ సమస్యలు ఉన్నట్లయితే ఉల్లిపాయను తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి, పొట్టను ఆరోగ్యంగా ఉంచడానికి సలాడ్ రూపంలో ఉల్లిపాయను తీసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి