Almond Benefits: రోజూ బాదం పప్పులను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే.. తెలిస్తే అసలు వదిలిపెట్టలేరు..

పోషకాలు ఉండే పదార్థాలలో బాదం పప్పులు కూడా ముఖ్యమైనవి. నిజానికి బాదం పప్పు పోషకాల గని. దీనిని బాదం వెన్న, బాదం పాలు, బాదం..

Almond Benefits: రోజూ బాదం పప్పులను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే.. తెలిస్తే అసలు వదిలిపెట్టలేరు..
Almonds Health Benefits
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 11, 2023 | 1:22 PM

ప్రస్తుత కాలంలో అనేక మంది పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీటికి వారు పాటిస్తున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు కారణమని చెప్పుకోవాలి. అయితే ఈ కారణాలకు మించిన మరో విషయం ఏమిటంటే తినే ఆహారంలో పోషకాలు సరిపడా లేకపోవడమే. అందుకోసం పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా  చేస్తే ఆరోగ్య సమస్యలు దూరం కావడమే కాక లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని వారు వివరిస్తున్నారు. వారు చెప్పిన పోషకాలు ఉండే పదార్థాలలో బాదం పప్పులు కూడా ముఖ్యమైనవి. నిజానికి బాదం పప్పు పోషకాల గని. దీనిని బాదం వెన్న, బాదం పాలు, బాదం నూనె తయారీలో కూడా ఉపయోగిస్తారు.

బాదం పప్పును పచ్చిగా తినడంతో పాటు వివిధ రకాల వంటకాల్లో కూడా వాడతారు. ఇందులో ఎన్నో రకాల ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు మరియు ఫైబర్లు సమృద్ధిగా లభిస్తాయి. సాధారణంగా దీనిని రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే తింటారు. ఈ బాదంను మనదేశంలో జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు కూడా బాదంలో పుష్కలంగా ఉంటాయి. మరి ఈ బాదం పప్పులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

బాదం పప్పు ఆరోగ్య ప్రయోజనాలు: 

  1. రోజూ బాదం తినడం వల్ల మీ నడుమ చుట్టు ఉన్న కొవ్వు కరుగుతుంది. తద్వారా మీరు బరువు తగ్గుతారు. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
  2. బాదం పప్పు తినడం వల్ల మెదడు పనితీరు బాగుంటుంది. తద్వారా మీ జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
  3. ఎముకలు గట్టి పడటానికి, బోన్స్ ఆరోగ్యంగా ఉండటానికి బాదం అద్భుతంగా పనిచేస్తుంది.
  4. డయాబెటిస్ రోగులకు బాదం దివ్యౌషదమనే చెప్పాలి. ఇది రక్తం‌లో చక్కెర స్థాయిలను సూపర్ పనిచేస్తుంది.
  5. బాదం తినడం వల్ల రొమ్ము క్యా‌న్సర్, ప్రొస్టేట్ క్యా‌న్సర్లు వంటివి రావు.
  6. ఆల్మండ్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
  7. నానబెట్టిన బాదంపప్పును తీసుకోవడం వల్ల మధుమేహం వల్ల సంభవించే బలహీనతల నుంచి ఉపశమనం పొందవచ్చు.
  8. ఆయుర్వేదం ప్రకారం.. స్థూలకాయం, ప్రీడయాబెటిస్ మెటబాలిక్ సిండ్రోమ్ వంటి రుగ్మతలను అధిగమించడంలో బాదం సహాయపడుతుంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..