AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Protein Rich Food : మీకు నాన్‎వెజ్ తినే అలవాటు లేదా? అయితే మీ డైట్‎లో ఈ ప్రొటీన్ ఫుడ్స్ చేర్చుకోండి..!!

మన శరీరానికి కావాల్సినంత పోషకాహారం ఎప్పటికప్పుడు అందించడం చాలా ముఖ్యం. లేదంటే ఎన్నో రోగాలు మనల్ని చుట్టుముడుతాయి. శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్స్ అందిస్తుండాలి.

Protein Rich Food : మీకు నాన్‎వెజ్ తినే అలవాటు లేదా? అయితే మీ డైట్‎లో ఈ  ప్రొటీన్ ఫుడ్స్ చేర్చుకోండి..!!
Protien
Madhavi
| Edited By: Janardhan Veluru|

Updated on: Feb 11, 2023 | 4:59 PM

Share

మన శరీరానికి కావాల్సినంత పోషకాహారం ఎప్పటికప్పుడు అందించడం చాలా ముఖ్యం. లేదంటే ఎన్నో రోగాలు మనల్ని చుట్టుముడుతాయి. శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్స్ అందిస్తుండాలి. కొంతమంది ఎక్కువగా నాన్‎వెజ్ తీసుకుంటారు. నాన్‎వెజ్‎లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. మాంసాహారం తీసుకునేవారికి కావాల్సినంత ప్రొటీన్ అందుతుంది. కానీ శాఖాహారులైతే…కావాల్సిన మొత్తంలో ప్రొటీన్ తీసుకోలేరు. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. శాఖాహారులు కూడా వారికి కావాల్సిన ప్రొటీన్స్ శరీరానికి అందించవచ్చు. మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా రిచ్ ప్రొటీన్స్ లభించే ఐదు శాఖాహారాలేంటో తెలుసుకుందాం..

నాన్‎వెజ్‎కు 5 ప్రత్యామ్నాయా శాఖాహారాలు:

టోఫు:

టోఫు సోయాబీన్‎ల నుంచి తయారు చేస్తారు. సోయాపాలను ఘనీభవిస్తే ఇది తయారవుతుంది. చూడాటానికి పనీర్ వలే ఉంటుంది. దీన్ని డైరెక్టుగా కూడా తినవచ్చు. రకరకాల వంటల్లో ఉపయోగించవచ్చు. ఇది ప్రోటీన్‎కు మంచి మూలం. 100 గ్రాముల టోఫు తీసుకుంటే 8 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తుంది. టోఫును పాన్-ఫ్రైడ్, బేక్, గ్రిల్ లేదా సూప్‌లు స్టైర్-ఫ్రైస్‌లకు వంటి వంటల్లో ఉపయోగించవచ్చు. శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లు శాఖాహారమైన టోఫు ద్వారా పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

కాయధాన్యాలు:

అనేక శాఖాహార ఆహారాలలో కాయధాన్యాలు చాలా ముఖ్యమైన ఆహారం. వీటిలో ప్రొటీన్లు, పీచుపదార్థాలు, ఇతర ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉంటాయి. 100 గ్రాముల కాయధాన్యాలు తీసుకుంటే 9 గ్రాముల ప్రోటీన్‌ను అందుతుంది. కాయధాన్యాలను సలాడ్లు, సూప్‌లు, కూరలు వంటి వివిధ రకాల వంటలలో ఉపయోగించవచ్చు.

క్వినోవా:

హెల్దీ డైట్ ఫాలో అయ్యేవారికి క్వీనోవా గురంచి బాగా తెలుస్తుంది. ఇందులో ప్రొటీన్స్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి కండరాలు, ఎముకలు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. 100 గ్రాములకు 8 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తుంది. క్వినోవాను అన్నానికి బదులుగా లేదా సలాడ్‌లకు బేస్‌గా తీసుకోవచ్చు. రోజుకు ఒకటి నుంచి రెండు కప్పుల క్వినోవాను తినవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.

చిక్‌పీస్:

చిక్‌పీస్‎ను గార్బన్జో బీన్స్ అని కూడా పిలుస్తారు. ఇందులో ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిని ఆహారంలో చేర్చుకుంటే 100 గ్రాములకు 7 గ్రాముల ప్రోటీన్‌ను అందుతుంది. చిక్‌పీస్‌ను హుమ్ముస్, సలాడ్స్ తోపాటు రకరకాల వంటల్లో ఉపయోగించవచ్చు.

వేరుశెనగలు:

వేరుశెనగలలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అధిక మొత్తంలో లభిస్తుంది. వేరుశెనగలను డైట్‎లో చేర్చుకుంటే 100 గ్రాములకు 7 గ్రాముల ప్రోటీన్‌ను అందుతుంది. వేరుశెనగను వెన్న, సాస్‌లు స్మూతీస్ వంటి వివిధ రకాల వంటలలో ఉపయోగించవచ్చు.

మాంసాహారానికి సమానంగా ఉండే శాఖాహారాల్లో కూడా ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. పైన పేర్కొన్న ఐదు ప్రొటీన్ రిచ్ ఫుడ్స్ రుచితోపాటు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలన్నింటిని అందిస్తాయి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..