AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Depression: మీలో డిప్రెషన్ పెరుగుతోందా..? అయితే కచ్చితంగా ఆ కారణం కావొచ్చు.. సంచలన రిపోర్ట్..!!

గత దశాబ్ద కాలంగా మనం గమనించినట్లయితే వాయు కాలుష్యం తీవ్రంగా మారుతుంది. పరిశ్రమలు పెరిగే కొద్దీ గాలిలో నాణ్యత లోపిస్తోంది. తద్వారా మనం పీల్చే ప్రాణవాయువు విషతుల్యంగా మారుతోంది.

Depression: మీలో డిప్రెషన్ పెరుగుతోందా..? అయితే కచ్చితంగా ఆ కారణం కావొచ్చు.. సంచలన రిపోర్ట్..!!
Depression
Madhavi
| Edited By: Janardhan Veluru|

Updated on: Feb 11, 2023 | 3:30 PM

Share

గత దశాబ్ద కాలంగా మనం గమనించినట్లయితే వాయు కాలుష్యం తీవ్రంగా మారుతుంది. పరిశ్రమలు పెరిగే కొద్దీ గాలిలో నాణ్యత లోపిస్తోంది. తద్వారా మనం పీల్చే ప్రాణవాయువు విషతుల్యంగా మారుతోంది. అయితే దీని ఎఫెక్ట్ నేరుగా మన శరీరంపై చూపిస్తోంది. ముఖ్యంగా వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు గుండె సహా శరీరంలోని ఇతర భాగాలు ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అయితే వాయు కాలుష్యం వల్ల శరీరం మాత్రమే కాదు, మెదడు కూడా దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. ముఖ్యంగా వాయు కాలుష్యం వల్ల మనుషుల్లో డిప్రెషన్ పెరుగుతోందని ఇటీవల ఒక అధ్యయనం వెల్లడించింది దీంతో ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన కనిపిస్తోంది.

వాయు కాలుష్యం వల్ల మీ శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది అంటే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. కానీ చాలా మందిలో కాలుష్యం తమ మానసిక ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో అర్థం కాకపోవచ్చు. వాయు కాలుష్యం, మానసిక ఆరోగ్యానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. కాలుష్యం వల్ల ప్రజల జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది. కాలుష్యం డిప్రెషన్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతే కాదు వారి మానసిక సమస్యలను ప్రేరేపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చాలా మంది ఈ సమస్యలను విస్మరిస్తున్నారు. దీని కారణంగా ప్రమాదం మరింత పెరుగుతోంది. వాయుకాలుష్యం మీ శరీరానికి, మనస్సుకు శత్రువుగా ఎలా మారుతుందో ఈ రోజు మనం తెలుసుకుందాం.

కలుషిత ప్రాంతాల్లో నివసించే వ్యక్తులకు డిప్రెషన్ ప్రమాదం ఎక్కువగా ఉందని JAMA నెట్‌వర్క్ ఓపెన్‌ నివేదికలో తెలిపింది. శుక్రవారం ప్రచురించిన ఈ అధ్యయనంలో కాలుష్యంతో దీర్ఘకాలిక ఎక్స్‌పోజర్ వల్ల డిప్రెషన్ రిస్క్ పెరుగుతుందని తేల్చింది. ఈ అధ్యయనం చేసిన పరిశోధకులు మెడికేర్ ద్వారా తమ ఆరోగ్య బీమాను పొందిన 8.9 మిలియన్ల కంటే ఎక్కువ మంది వ్యక్తుల సమాచారాన్ని పరిశీలించారు. 2005 నుండి 2016 వరకు అధ్యయన కాలంలో 1.52 మిలియన్ల కంటే ఎక్కువ మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారని ఈ అధ్యయనం ద్వారా కనుగొన్నారు. కానీ ఈ సంఖ్య చాలా తక్కువ అని, ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ అధ్యయనంలో, వాయు కాలుష్యానికి మానసిక ఆరోగ్యంతో ప్రత్యక్ష సంబంధం ఉందని తేల్చింది. కాలుష్యం కారణంగా మానసిక అనారోగ్యంపై చాలా తీవ్రంగా ఉంటుందని. ఈ అధ్యయనంలో తేలింది. అధ్యయనం సమయంలో, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిలో 32 శాతం మందికి చికిత్స అవసరమని గమనించారు. వాయు కాలుష్యం పెరగడం వల్ల డిప్రెషన్‌, యాంగ్జయిటీ కేసులు కూడా పెరుగుతున్నాయని పరిశోధకులు తెలిపారు. దీని వల్ల చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. వాయు కాలుష్యం వల్ల డిమెన్షియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2019 సంవత్సరపు ప్రపంచ సమీక్షలో, వాయు కాలుష్యం మన శరీరంలోని ప్రతి భాగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని వెల్లడైంది.

వాయు కాలుష్య ప్రభావం చిన్న పిల్లలు, వృద్ధులపై మరింత ఎక్కువగా ఉంటుంది. అంతే కాదు కాలుష్యం వల్ల డిప్రెషన్ ముప్పు కూడా పెరుగుతుంది. విషపూరితమైన గాలి మీ ఊపిరితిత్తులకు గుండెకు ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..