AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relationship Tips: రిలేషన్ షిప్ లో ఈ తప్పులు అస్సలు చేయకండి.. చేస్తే మాత్రం భారీ మూల్యం తప్పదు..

భార్యాభర్తల బంధం ఎంత బలమైనదో.. అంతే సున్నితమైనది కూడా. వారి మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలే.. చినికి చినికి గాలి వానలా మారి పెద్ద అగాథాన్ని సృష్టిస్తాయి. కొన్ని సార్లు దంపతులు విడిపోయే..

Relationship Tips: రిలేషన్ షిప్ లో ఈ తప్పులు అస్సలు చేయకండి.. చేస్తే మాత్రం భారీ మూల్యం తప్పదు..
Live In Relationship
Ganesh Mudavath
|

Updated on: Feb 11, 2023 | 2:42 PM

Share

భార్యాభర్తల బంధం ఎంత బలమైనదో.. అంతే సున్నితమైనది కూడా. వారి మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలే.. చినికి చినికి గాలి వానలా మారి పెద్ద అగాథాన్ని సృష్టిస్తాయి. కొన్ని సార్లు దంపతులు విడిపోయే పరిస్థితులు కూడా రావచ్చు. కాబట్టి దాంపత్య జీవితంలో ఇద్దరూ సమానమనే విషయాన్ని గుర్తించాలి. ఒకరి ఇష్టాయిష్టాలను మరొకరు గౌరవించుకోవాలి. ప్రేమికుల విషయంలోనూ ఇదే నియమం వర్తిస్తుంది. ఒక వ్యక్తి ఎవరితోనైనా ప్రేమలో ఉన్నప్పుడు.. ముందు వారు చేసే పనులు బాగానే అనిపిస్తాయి. కానీ రిలేషన్ షిప్ లో కాలం గడుస్తున్న కొద్దీ ఆ పనులే చిరాకు కలిగిస్తుంటాయి. తప్పుగా అనిపిస్తుంటాయి. ఫలితంగా ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలకు దారి తీస్తాయి. ఏదైనా బంధం దృఢంగా ఉండాలంటే నమ్మకం, గౌరవం, అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. సంబంధాలు అనేవి చాలా సున్నితంగా ఉంటాయి. వీటిని నిర్వహించడం అంత సులభం కాదు. మనం ఇష్టపడే వ్యక్తులతో మన సంబంధాన్ని బలంగా ఉంచుకోవడానికి కొన్ని విషయాలపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.

మీ భాగస్వామిని అనుమానించకండి: ఏదైనా సంబంధానికి పునాది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. రిలేషన్ ను బలంగా ఉంచుకోవడానికి భాగస్వామిని విశ్వసించడం చాలా ముఖ్యం. చిన్న విషయాలపై అనవసరంగా అనుమానించే అలవాటు సంబంధంపై ప్రభావం చూపుతుంది. ఇలా చేయడం ద్వారా క్రమంగా అపార్థాలు పెరుగుతాయి. బంధాలు విచ్ఛిన్నమవుతాయి. అందుకే పార్ట్నర్ తో సంబంధాన్ని బలంగా ఉంచుకోవడానికి.. వారిని నమ్మాలి.

ముఖ్యమైన విషయాలను విస్మరించవద్దు: కొంతమందికి విషయాలను మర్చిపోయే అలవాటు ఉంటుంది. కాలక్రమేణా ఇది పెరుగుతున్న సంబంధాన్ని విషపూరితం చేస్తుంది. దూరాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ఏ విషయమైనా ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి. సమస్య వస్తే పరిష్కరించుకోవాలి. వీటిని నిర్లక్ష్యం చేస్తే రిలేషన్ లో అపార్థాలు పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

భాగస్వామిని గౌరవించకపోవడం: ఏదైనా సంబంధాన్ని బలంగా ఉంచుకోవడానికి, ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. కోపంతో ఏదైనా సూటిగా మాట్లాడటం, ఇతర వ్యక్తుల ముందు భాగస్వామిని తక్కువ చేసి మాట్లాడటం వంటివి చేయకూడదు. సంబంధం పాతది, బలమైనది అయినప్పటికీ.. లైఫ్ పార్ట్ నర్ ను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉండాలి. కోపం లేదా గొడవలు జరిగితే పరిమితులను దాటకూడదు. ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు చాలా ఆవేశంగా మాట్లాడతాం. ఇది రిలేషన్ పై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం