AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Charcoal Face Mask: నల్లటి బొగ్గు ముఖానికి మెరుపు తెస్తుంది నమ్మండి.. చార్‎కోల్ ఫేస్‎మాస్క్ ఓ సారి ట్రై చేసి చూడండి.!!

Skin Care Tips: అందంగా కనిపించాలని అందరూ అనుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలకు అందంపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అందంగా కనిపించేందు మార్కెట్లో దొరికే రకరకాల ఖరీదైన ఉత్పత్తులను వాడుతుంటారు.

Charcoal Face Mask: నల్లటి బొగ్గు ముఖానికి మెరుపు తెస్తుంది నమ్మండి.. చార్‎కోల్ ఫేస్‎మాస్క్ ఓ సారి ట్రై చేసి చూడండి.!!
Charcoal Face Mask
Madhavi
| Edited By: Janardhan Veluru|

Updated on: Feb 11, 2023 | 3:40 PM

Share

అందంగా కనిపించాలని అందరూ అనుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలకు అందంపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అందంగా కనిపించేందు మార్కెట్లో దొరికే రకరకాల ఖరీదైన ఉత్పత్తులను వాడుతుంటారు. ఖరీదైనా ఉత్పత్తులైనప్పటికీ శాశ్వత పరిష్కారం చూపవు. రోజంతా కాలుష్యంలో తిరిగి దుమ్ము ధూళి, చెమటతో పాటు ఇతర కారణాలతో చర్మం కమిలిపోతుంది. చర్మాన్ని కాపాడుకునేందుకు మార్కెట్లో దొరికే ఉత్పత్తుల కంటే.. సహజ ఉత్పత్తులపై ఆధారపడటం మంచిది. అలాంటి పదార్థాల్లో కార్బన్ ఒకటి. కార్బన్ నుంచి తయారయ్యే స్వచ్చమైన రూపాలలో అద్భుతమైన పదార్థం చార్‎కోల్. ఇది వినడానికి కాస్త ఇబ్బందికరంగానే అనిపించినప్పటికీ…చార్‎కోల్ అనేది బొగ్గు. ఇది చర్మంపై ఉన్న మురికి, మలినాలు, ధూళిని దూరం చేస్తుంది. యాక్టివేటెడ్ చార్‎కోల్ ఫేస్‎మాస్క్ వాడటం వల్ల డల్‎స్కీన్ వదిలించుకోవచ్చు. మీ చర్మం సహజంగా మెరుస్తుంది. యాక్టివేట్ చేసిన బొగ్గుతో తయారు చేసిన మాస్క్‎ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

చర్మాన్ని మెరిసేలా చేస్తుంది:

యాక్టివేటెడ్ చార్‎కోల్ చర్మంపై ఉన్న మలినాలను ధూళి, నూనెను పీల్చుకుంటుంది. దుమ్ము, ధూళి ఇతర కారకాల వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. పగుళ్లు ఏర్పడుతాయి. ఈ చార్‎కోల్ ఫేస్ మాస్క్ ఉపయోగించినట్లయితే ఇది డీప్ క్లీనింగ్ ఏజెంట్‎గా పనిచేస్తుంది. చర్మం నుంచి టాక్సిన్స్, మలినాలను తొలగిస్తుంది. ఇలా ప్రతిసారి చార్‎కోల్‎తో మీ ముఖానికి మాస్క్ వేసుకున్నట్లయితే మీ చర్మం నీట్‎గా తయారవుతుంది.

రంధ్రాలను అన్‎క్లాగ్ చేస్తుంది:

చర్మ సంరక్షణలో ఎక్స్‎ఫోలియేట్ అనేది ముఖ్యమైంది. ఎక్స్‎ఫోలియేట్ చేయడం వల్ల మీ చర్మం మరింత ఫ్రెష్‎గా తయారవుతుంది. యాక్టివేటెడ్ చార్‌కోల్‌లోని శోషక లక్షణాలు, చర్మంపై రంధ్రాలను అన్‌లాగ్ చేయడంలో సహాయపడతాయి. బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, ఇతర రకాల మొటిమల మచ్చలను తగ్గిస్తాయి.

ఇవి కూడా చదవండి

చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది:

ఫేస్‎మాస్క్ మృత చర్మ కణాలను తొలగించి, తాజా చర్మాన్ని బహిర్గతం చేసేందుకు సహాయపడుతుంది. యాక్టివేటెడ్ చార్‎కోల్ స్కిన్‎టోన్‌ను ప్రకాశవంతంగా, మెరిసేలా చేస్తుంది.

చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది:

చర్మం తేమగా ఉండటం చాలా అవసరం. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు కావాల్సిన నీరు అందించాలి. శరీరానికి కావాల్సిన నీరు అందించనట్లయితే చర్మం డీహైడ్రేట్ అవుతుంది. చర్మాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడేందు చార్‌కోల్ ఫేస్‎మాస్క్‌ల్లో అలోవెరా, గ్లిజరిన్ లేదా హైలురోనిక్ యాసిడ్ వంటి అదనపు హైడ్రేటింగ్ పదార్థాలను కలిగి ఉంటాయి. ఇవి ముఖంపై చారలు, ముడతలను తగ్గిస్తాయి. చర్మం యవ్వనంగా కాంతివంతంగా కనిపించేలా చేస్తాయి.

మంటను తగ్గిస్తుంది:

యాక్టివేటెడ్ చార్‌కోల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మంట, చికాకును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది సున్నితమైన చర్మం లేదా రోసేసియా వంటి పరిస్థితులకు చాలా అనువైంది.

మొత్తానికి యాక్టివేటెడ్ చార్‌కోల్ ఫేస్‎మాస్క్‌ని ఉపయోగించడం వల్ల చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి ప్రకాశవంతమైన చర్మాన్ని అందిస్తుంది. ఈ చార్ కోల్ ఫేస్ మాస్కులను ఉపయోగించే ముందు సూచనలు జాగ్రత్తగా పాటించాలని గుర్తుంచుకోండి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..