Washing Machine: వాషింగ్‌ మిషన్‌ను ఎక్కువ కాలం ఉపయోగించాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే ఇక అంతే!

ఒకప్పుడు చాలామంది రాతిబండపై చేతులు పడిపోయేలా బట్టలను ఉతికేవారు. కానీ ప్రస్తుతం వాషింగ్ మెషిన్లు వాడుకలోకి రావడంతో ఈ పని చాలా సులభం అయ్యింది. సమయం కూడా ఆదా అవుతోంది.

Washing Machine: వాషింగ్‌ మిషన్‌ను ఎక్కువ కాలం ఉపయోగించాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే ఇక అంతే!
Washing Machine
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Feb 11, 2023 | 4:01 PM

ఒకప్పుడు చాలామంది రాతిబండపై చేతులు పడిపోయేలా బట్టలను ఉతికేవారు. కానీ ప్రస్తుతం వాషింగ్ మెషిన్లు వాడుకలోకి రావడంతో ఈ పని చాలా సులభం అయ్యింది. సమయం కూడా ఆదా అవుతోంది. ఇక ఇప్పుడు మార్కెట్‌లో ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ఇందులో బట్టలు వేసిన తర్వాత మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బట్టలు ఉతకడం, వాటిని పిండటం కూడా అవే చేస్తాయి. అయితే వాషింగ్ మెషిన్‌ చాలాకాలం ఉపయోగించాలంటే దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని చిట్కాలని అనుసరించడం ద్వారా మీరు వాషింగ్ మిషన్లను చాలాకాలం పాటు ఉపయోగించుకోవచ్చు. మరి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సామర్థ్యానికి తగినట్లుగా బట్టలు వేయాలి..

మార్కెట్లో మీరు 6, 7, 8 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాషింగ్ మెషిన్లు అందుబాటులో ఉన్నాయి. వాషింగ్ మెషిన్ చాలాకాలం కొనసాగాలంటే దాని సామర్థ్యానికి తగ్గట్టుగా అందులో బట్టలు వేయాలి. చాలాసార్లు ప్రజలు త్వరగా ఉతకడానికి, నీటిని ఆదా చేయడానికి మిషిన్‌లో బట్టలు ఎక్కువగా వేస్తుంటారు. అలా చేయడంతో యంత్రంపై లోడ్ ఎక్కువై దాని పనితనం తగ్గిపోతుంది.

సరైన డిటర్జెంట్

ఇవి కూడా చదవండి

వాషింగ్ మెషిన్‌లో బట్టలు ఉతికేటప్పుడు చాలామంది డిటర్జెంట్‌ను ఉపయోగిస్తారు. అయితే సరైన డిటర్జెంట్‌ వాడటం ముఖ్యం. ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్లకి లిక్విడ్ డిటర్జెంట్లు మాత్రమే వాడాలి. వాస్తవానికి డిటర్జెంట్ వాషింగ్ మెషిన్ లైఫ్ టైంని ప్రభావితం చేస్తుంది. అందువల్ల సరైన డిటర్జెంట్ ఎంచుకోవడం అవసరం.

వారానికి ఒకసారి క్లీనింగ్‌

మెషిన్ మంచి పనితీరు కోసం వారానికి ఒకసారి దానిని క్లీన్ చేయాలి. తద్వారా దాని సామర్థ్యం మెరుగవుతుంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం యంత్రం ఎక్కువసేపు పనిచేయాలంటే.. దాని మెయింటనెన్స్‌ సరిగ్గా ఉండాలి. యంత్రాన్ని శుభ్రం చేయకపోతే అది త్వరగా చెడిపోతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..