IND Vs AUS: టీమిండియా కెప్టెన్‌తో ఆసీస్ బౌలర్ గొడవ.. మ్యాచ్ మధ్యలో రచ్చ రంబోలా.. అసలేం జరిగిందంటే?

భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాగ్‌పూర్ వేదికగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండు జట్లలోని దిగ్గజ బ్యాటర్లు..

IND Vs AUS: టీమిండియా కెప్టెన్‌తో ఆసీస్ బౌలర్ గొడవ.. మ్యాచ్ మధ్యలో రచ్చ రంబోలా.. అసలేం జరిగిందంటే?
India Vs Australia
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 10, 2023 | 10:10 AM

భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాగ్‌పూర్ వేదికగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండు జట్లలోని దిగ్గజ బ్యాటర్లు సునీల్ గవాస్కర్, అలన్ బోర్డర్ పేర్లతో ఈ సిరీస్‌ను మొదలుపెట్టారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఇది మరో యాషెస్ సిరీస్ అని చెప్పొచ్చు. ఇక మనం ఫిబ్రవరి 10వ తేదీన ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకోవాలి. ఆ ఘటనతో మొత్తం క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది.

ఇది దాదాపు 1981 నాటిది. ఆ సమయంలో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌ జరుగుతోంది. సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో ఉండగా, చివరి మ్యాచ్ మెల్‌బోర్న్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆరంభం ఫర్వాలేదనిపించింది. దీంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 419 పరుగులకు ఆలౌటైంది. ఇలాంటి స్థితిలో రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కచ్చితంగా మంచి స్కోర్ చేయాల్సి ఉంది.

గవాస్కర్ వర్సెస్ లిల్లీ: రచ్చ రంబోలా..

ఈ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ సునీల్ గవాస్కర్ తరచూ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యేవాడు. అయితే మెల్‌బోర్న్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం గవాస్కర్ తన ఓపెనింగ్ భాగస్వామి చేతన్ చౌహాన్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి 165 పరుగులు జోడించాడు. గవాస్కర్ 70 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ చేసినప్పుడు అసలు గొడవ మొదలైంది. ఆస్ట్రేలియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ గవాస్కర్‌పై ఎల్‌బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయగా.. దానికి అంపైర్ రెక్స్ వైట్‌హెడ్ అవుట్ అని ఇచ్చాడు. దీనితో గవాస్కర్ ఒక్కసారిగా మండిపోయి.. అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. బంతి బ్యాట్‌కు తగిలినా అంపైర్ వినిపించుకోలేదని.. ఔట్‌గా ప్రకటించాడని గొడవపడ్డాడు. అక్కడే గవాస్కర్ కోపంతో క్రీజులో నిలబడి ఉన్నాడు. లిల్లీ ఏమో ప్యాడ్ వైపు చూపిస్తూ.. అతడు ఔట్ అని అభివర్ణించాడు. అంతే కాకుండా కొన్ని స్లెడ్జింగ్ చేయడం కూడా మొదలుపెట్టాడు. దీంతో గవాస్కర్ పెవిలియన్‌కు తనతో పాటు మరో ఓపెనర్‌ను కూడా తీసుకెళ్లాడు. ఫ్యాన్స్ అందరూ కూడా ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు.

చివరికి భారత్ గెలిచింది..

ఇద్దరు బ్యాటర్లు పెవిలియన్ చేరకముందే భారత జట్టు మేనేజర్లురంగంలోకి దిగి గొడవను సద్దుమణిగించారు. తద్వారా ఆ ఇన్నింగ్స్‌లో భారత్ 324 పరుగులు చేసింది. ఇక ఆస్ట్రేలియా‌కు 143 పరుగుల టార్గెట్ నిర్దేశించబడింది. కానీ కపిల్ దేవ్ బౌలింగ్ దెబ్బకు ఆస్ట్రేలియా కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో కపిల్ 5 వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.