IND vs AUS: విరాట్ కోహ్లీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న ఫ్యాన్స్
నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభమైన తొలి టెస్టులో కోహ్లీ రెండు క్యాచ్‌లు జారవిడిచాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఉండగా స్టీవ్ స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లీ మిస్ చేశాడు. 16వ ఓవర్లో అక్షర్ పటేల్ వేసిన తొలి బంతిని.. స్మిత్ ఔట్‌సైడ్ ఎడ్జ్ దిశగా ఆడాడు.
క్రికెట్ మైదానంలో ఎంతో చురుగ్గా ఉంటాడు విరాట్ కోహ్లీ. పదునైన ఫీల్డింగ్ కు మారుపేరైన అతను కష్టమైన క్యాచ్‌లను కూడా అద్భుతంగా అందుకున్నాడు. కోహ్లీ చేతి నుంచి బంతి మిస్సవ్వడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. తాజాగా గురువారం నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభమైన తొలి టెస్టులో కోహ్లీ రెండు క్యాచ్‌లు జారవిడిచాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఉండగా స్టీవ్ స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లీ మిస్ చేశాడు. 16వ ఓవర్లో అక్షర్ పటేల్ వేసిన తొలి బంతిని.. స్మిత్ ఔట్‌సైడ్ ఎడ్జ్ దిశగా ఆడాడు. ఆ సమయంలో ఫస్ట్‌స్లిప్‌లో ఉన్నాడు కోహ్లి. మెరుపు వేగంతో వచ్చిన బంతిని అందుకునేలోపే బాల్ అతడి చేతి నుంచి కాస్త దూరంగా వెళ్లింది. దీంతో కోహ్లి క్యాచ్ మిస్ చేశాడు. చురుకైన ఫీల్డర్‌గా పేరుపొందిన కోహ్లీ ఇలా క్యాచ్ డ్రాప్ చేయడం అక్షర్ పటేల్, రోహిత్ శర్మలకు కూడా ఆశ్చర్యం కలిగించింది. దీని తర్వాత మరో క్యాచ్‌ను కూడా ఇలాగే జారవిడిచాడు విరాట్. ఈ క్రమంలో నాగ్‌పూర్ టెస్ట్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తోన్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా కోహ్లి ఫీల్డింగ్‌పై ఘాటుగా స్పందించాడు. కోహ్లి క్రికెట్ గ్రౌండ్‌లో ఉన్నప్పటికి బాడీ ప్రజెంట్.. మైండ్ ఆబ్సెంట్ తరహాలో ఆడుతున్నాడంటూ ఎద్దేవా చేశాడు.
‘మేటి ఫీల్డర్ అని పేరున్న కోహ్లి ఇలా రెండు క్యాచ్‌లు మిస్ చేయడం చాలా ఆశ్చర్యపరిచింది. కోహ్లి గేమ్‌లో ఉన్నప్పటికి తన బాడీ మాత్రమే ప్రజెంట్.. మైండ్ ఆబ్సెంట్ అన్న తరహాలో ఉన్నాడు. మైదానంలో ప్లేయర్.. ప్రతి బంతి తన వైపే వస్తుందా అన్నంత అప్రమత్తంగా ఉండాలి. ఇక స్లిప్ ఫీల్డింగ్ అంటే ఎంతో ఏకాగ్రత అవసరం. ఒక్క క్షణం ఏమరపాటుగా ఉన్న ఇలాగే క్యాచ్‌లు మిస్సవ్వుతాం’ అంటూ కోహ్లీని విమర్శించాడు మార్క్‌వా. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. కోహ్లిని తప్పుపడుతూ మార్క్ వా చేసిన వ్యాఖ్యలపై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘అందరూ మీ అంత షార్ప్‌గా ఉండలేరు కదా.. అప్పుడప్పుడు తప్పులు జరుగుతుంటాయి. కోహ్లి ఎంత మంచి ఫీల్డరో మాకు తెలుసు. మీరు మరీ ఇంత ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు’ అంటూ మార్క్ వాపై మండి పడుతున్నారు.
Catch dropped by Virat Kohli of steve Smith! ?
But the catch was not that easy ?#INDvsAUS #ViratKohli? #BorderGavaskarTrophy #BGT2023 pic.twitter.com/juSGGfsp62
— Vansh (@VanshJaiman07) February 9, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..